మంచాన్ని స్ట్రెచర్ గా చేసి…

చంద్రునిపై కాలు మోపేందుకు దేశం ఓ పక్క పురోగమిస్తుంటే..  మరోపక్క  దేశంలోని గ్రామాలకు సరైన రోడ్డు, రవాణా సదుపాయాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. అస్సాంలోని చిరాంగ్ జిల్లాలో ఓ మహిళ ప్రసవం కోసం ఆసుపత్రికి వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడి, మార్గమధ్యంలోనే ప్రసవించింది.

ఉడాల్గురి గ్రామానికి చెందిన  ఆ మహిళ పురిటి నొప్పులతో బాధపడుతుండగా ఆమె కుటుంబ సభ్యులు ఆమెను దగ్గర్లోని ఆసుపత్రికి తీసుకుళ్లాలనుకున్నారు. ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతో అంబులెన్స్ కోసం కాల్ చేశారు. సిబ్బంది నుంచి ఎటువంటి స్పందన రాలేదు.  అసలే ఆ గ్రామానికి రోడ్డు బాగోలేకపోవడం, పైగా వర్షాలు.. ఈ  కారణాలతో ఆమె కుటుంబ సభ్యులు ఓ మంచాన్ని కావడిగా చేసి, దానిపై ఓ ప్లాస్టిక్ కవర్ ను  పరదాగా వేసి ఆమెను అందులోనే ఆసుపత్రికి తీసుకుపోయారు. దాదాపు 5 కి.మీ.ల దూరం పాటు ఇద్దరు వ్యక్తులు ఆ మంచాన్ని కావడిగా మోస్తూ ఆసుపత్రికి తరలించారు.  మార్గ మధ్యంలోనే మహిళ   ప్రసవించింది.  ప్రస్తుతం తల్లీ బిడ్డ ఆ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

Woman gives birth on make-shift stretcher while being carried for 5 kilometers

Latest Updates