ఒకే కాన్పులో ఆరుగురు..ఆ ఆనందం కొద్దిసేపైనా నిలవలే

ఆమె ఒక్క కాన్పులోనే ఆరుగురికి జన్మనిచ్చింది. కానీ, ఆ ఆనందం కొద్దిసేపైనా నిలవలేదు. ఇద్దరు పిల్లలు కళ్లు తెరవకుండానే చనిపోయారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని ష్యోపూర్ లో శనివారం (ఫిబ్రవరి 29) జరిగింది. పుట్టిన ఆరుగురిలో ఇద్దరు ఆడపిల్లలు కాగా, నలుగురు అబ్బాయిలు. ఇద్దరు అమ్మాయిలు ఆ కుటుంబానికి దక్కలేదు. మిగతా నలుగురు పిల్లల పరిస్థితీ విషమంగానే ఉంది. వాళ్లను ఆస్పత్రిలోని సిక్ న్యూబోర్న్స్ కేర్ యూనిట్ (ఎస్ఎన్ సీయూ)లో పెట్టి ట్రీట్ మెంట్ చేస్తున్నారు. బరోదా గ్రామానికి చెందిన మూర్తీ మలి అనే 22 ఏళ్ల మహిళకు నొప్పులు రావడంతో భోపాల్ లోని గాంధీమెడికల్ కాలేజీకి తీసుకెళ్లారు. అక్కడ ఆమె నార్మల్ డెలివరీలో ఆరుగురు పిల్లలకు జన్మనిచ్చింది. అయితే, ఆమె నెలలు నిండకముందే 28వ వారంలోపిల్లలకు జన్మనిచ్చింది. పిల్లలు తక్కు వ బరువుతో పుట్టారు. అందరూ కలిపి 3.65 కిలోలున్నారు. చనిపోయిన ఇద్దరు పిల్లలు 350 గ్రాములు, 400గ్రాములే ఉన్నారు. ప్రస్తు తం ట్రీట్ మెం ట్ తీసుకుంటు న్న మిగతా పిల్లలు 500 గ్రాముల నుంచి 790 గ్రాముల వరకు ఉన్నారు. ఆస్పత్రికి వచ్చి అడ్మిట్అయిన అరగంటలోపే మూర్తీ మలి పిల్లలకు జన్మనిచ్చి నట్టు ఆస్పత్రి సిబ్బంది చెప్పా రు. ఒకే కాన్పులో ఆరుగురు పిల్లలు పుట్టడం చాలా అరుదని,అలాంటి పిల్లలు బతకడమూ కష్టమని ఆస్పత్రి గైనకాలజిస్ట్​ డాక్టర్ అరుణ కుమార్ వివరించారు.

Latest Updates