భార్య ఆత్మహత్య.. భర్త ఫోన్ స్విచ్ ఆఫ్..

కుటుంబ తగాదాలతో ఓ మహిళ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లోని ఆర్బీ నగర్ కాలనీ లో జరిగింది. భార్యా భర్తల మధ్య మనస్పర్ధల కారణంగానే ఆ మహిళ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే..  ఆర్బీ నగర్ కాలనీ లో  తిలక్, రాజేశ్వరి అనే  దంపతులు గత నెల రోజులుగా నివాసముంటున్నారు. తిలక్ ఎయిర్ పోర్ట్ లో ఉద్యోగం చేస్తున్నట్లు సమాచారం. ఆదివారం రాత్రి తిలక్ ఇంట్లో లేని సమయంలో రాజేశ్వరి ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నది. ఉదయం నుంచి రాజేశ్వరి బయటకు రాక పోవడంతో ఇంటి యజమాని కృష్ణ తలుపులు తట్టాడు. తలుపులు తీయక పోవడంతో అనుమానం వచ్చిన కృష్ణ.. కిటికీ లోంచి చూడగా రాజేశ్వరి ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు గా గుర్తించాడు. వెంటనే ఈ విషయాన్ని ఆర్జీఐఏ పోలీసులకు తెలిపాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అనుమానాస్పద మృతి కింది కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు తిలక్ కోసం కాల్ చేయగా అతని ఫోన్ స్విచాఫ్ చేసి ఉండడంతో పోలీసులు ఆరా తీస్తున్నారు.

Latest Updates