ఇండ్ల పేరుతో మోసం.. మహిళకు మూడేళ్ల జైలు

శిక్ష విధించిన ఎల్ బీనగర్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్

హైదరాబాద్,వెలుగు: ఇండ్లు ఇప్పి స్తానని మోసం చేసిన మహిళకు రంగారెడ్డి జిల్లా రెండో మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ మంగళవారం శిక్షను ఖరారు చేసింది. 2013లో నమోదైన కేసులో దర్యాప్తు చేసిన ఎల్ బీనగర్  పోలీసులు సాక్ష్యాధారాలను కోర్టులో ప్రవేశపెట్టారు. నేరం రుజువు కావడంతో నిందితురాలిని దోషిగా తేల్చుతూ కోర్టు తీర్పు నిచ్చింది. వివరాల్లోకి వెళ్తే… ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ప్రాంతానికి చెందిన కరణం కిషోర్ కుమార్(35) భార్య భవానీ ‘శ్రీ కల్కి మహిళా మండలి’ పేరుతో మహిళా సంఘాన్ని నడుపుతోంది. ఎల్ బీనగర్  శ్రీనివాస నగర్ కి చెందిన కె.కల్పన (45)తో భవానీకి పరిచయం ఏర్పడింది. తనకు రాజకీయ ప్రముఖులు, ప్రభుత్వ అధికారులతో మంచి పరిచయాలు ఉన్నా యని భవానీతో పాటు మహిళా మండలి సభ్యులను కల్పన నమ్మించింది.

ఇందులో భాగంగా పేదలకు కేంద్ర ప్రభుత్వం ఇండ్లను నిర్మించి ఇస్తోందని కల్పన వారితో చెప్పింది. ఈ స్కీమ్ లో ముందుగా రూ.25 వేలు చెల్లిం చాలని చెప్పింది. భవానీతో పాటు శ్రీ కల్కి మహిళా మండలిలోని 25 మంది సభ్యులు ఒక్కోక్కరు రూ.25 వేల చొప్పున మొత్తం రూ. 6.25 లక్షల డబ్బును కల్పనకు ఇచ్చారు. దీంతో పాటు ఇతర ఖర్చుల కోసం రూ.1.25లక్షలను కల్పనకు చెల్లించారు. కల్పన వారికి రసీదులను కూడా ఇచ్చింది.

రెండేళ్ళు గడుస్తున్నా తమకు ఎలాంటి ఇండ్ల కేటాయిం పులు జరుగకపోవడంతో బాధితులు తాము మోసపోయామని గుర్తించారు. కల్పన చెప్పి న విధంగా ఎలాంటి స్కీమ్స్ లేవని తెలుసుకుని ఎల్ బీనగర్ పోలీసులకు కంప్లయింట్ చేశారు. 2013 ఫిబ్రవరి 23న పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్సై కె.సుధాకర్ కేసు దర్యాప్తు చేసి సాక్ష్యాలను కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. విచారణలో కల్పన నేరం చేసినట్లు తేలడంతో రెం డో మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ శ్రీమతి జి.కవితా దేవి.. కల్పనకు మూడేళ్ళ జైలు శిక్షతో పాటురూ.10వేల  ఫైన్ విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు.

Latest Updates