సైనేడ్ తో భార్య ప్రాణం తీసిన బ్యాంకు మేనేజర్

  • అదనపు కట్నం కోసం హత్య
  • హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం
  • పోలీసుల విచారణలో బయటపడ్డ అసలు నిజం
  • భర్త, అత్త మామలే చావుకు కారణమని వెల్లడి

చిత్తూరు: అదనపు కట్నం కోసం భార్యను హత్య చేసి, ఆ హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించాలనుకున్నాడు ఓ దుర్మార్గపు భర్త.  సైనెడ్ తో ఆమె నిండు ప్రాణం తీసి అందరిని నమ్మించాలని చూశాడు.

చిత్తూరు జిల్లా బంటుమిల్లి మండలం ముంజులూరు గ్రామానికి చెందిన చేబ్రోలు రవి(38)కి,  ఆమని(26) తో 5 సవంత్సరాల క్రితం పెళ్లయింది. వీరికి 4 సవంత్సరాల కూతురు. మదనపల్లి లోని బ్యాంక్ ఆఫ్ బరోడాలో మేనేజర్ గా పనిచేస్తున్న రవి.. గత కొంతకాలంగా ఆమనిని అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడు.

అయితే గత నెల 27న ఆమని బాత్రూమ్ లో కాలు జారి పడిందని, చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించామని ఆమని తల్లి తండ్రులకు ఫోన్ చేసి చెప్పాడు రవి. వారు హుటాహుటిన ఆసుపత్రికి వచ్చే లోపే ఆమని చనిపోవడంతో.. తమ కుమార్తెను రవి, అతని తల్లిదండ్రులే హత్య చేశారన్న  అనుమానంతో ఆమని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అనంతరం ఆమని మృతదేహాన్ని పోస్టుమార్టం చేయగా ఆమనికి సైనేడ్ ఇచ్చినట్లు నిర్ధారణ కావటంతో పోలీసులు  తమదైన పద్ధతిలో రవిని విచారించగా అసలు నిజం చెప్పాడు. రవిని, అతని తల్లిదండ్రులను అరెస్ట్ చేశారు.

Latest Updates