బోరు నీటి గొడవ… మహిళ హత్య

బోరు నీటి గొడవ మహిళ హత్యకు దారితీసింది . ఇది వికారాబాద్ జిల్లా మర్పల్ లి మండలం నర్సాపూర్ తండాలో మంగళవారం చోటు చేసుకుంది .వికారాబాద్ డీఎస్పీ శిరీష రాఘవేంద్ర, సీఐ శ్రీనివాస్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తండాకు చెంది న జమున బాయి(52), అదే తండాకు చెంది న హరియ(55), వ్యవసాయపొలాలు పక్కపక్కనే ఉండగా జొన్న పంటసాగు చేశారు. హరియా బోరు బావిలో నీరులేకపోగా, జమున బాయి బోరు బావి నుంచి రాత్రిపూట తన పంటకు మళ్లించుకుంటున్నాడు. దీనిపై 2 రోజుల కిందట ఆమె మర్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది . కుల పెద్దలతోరాజీ చేసుకోవాలని సూచించారు. హరియా తన మూడో వంతు పంటను ఇవ్వాలని కుల పెద్దలు తీర్పు ఇవ్వగా ఆమె ఒప్పుకోలేదు. దీంతో హరియా కక్షగటి మంగళవారం ఉదయం పొలం వద్ద జమున బాయిపై గొడ్డలితో నరికి హత్య చేశాడు. ఆమె మనవడు కుటుంబ సభ్యులకు తెలుపగా హాస్పిటల్‌ కు తీసుకెళ్లారు . దీంతో తండాలో తీవ్ర ఉద్రిక్తత నెలకొనడంతో పోలీసులు వెళ్లారు . మృతురాలి బంధువులు నిందితులను అప్పగించాలని పీఎస్‌‌‌‌ ఎదుట ఆందోళన చేశారు. హరియతో పాటు కొడుకు శంకర్, తుమ్మలపల్లికి చెందిన మన్నె శ్రీనివాస్ కలిసి హత్య చేశారని బాధిత కుటుంబీకులు కంప్లయింట్‌‌‌‌ చేయగా కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని అప్పగించారు. కాగా తండాలో పరిస్థితి ఉద్రిక్తంగా ఉండడం, నిందితులు పరార్‌‌‌‌ అయినందున వారి ఆస్తులపై దాడి జరిగే అవకాశం ఉండడంతో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు.

Latest Updates