వేధింపులు భరించలేక భర్తను చంపిన భార్య

woman-killed-her-husband-then-cuts-off-his-genitals-and-feeds-to-dogs

పడుకున్న భర్తను చంపేసింది అతని భార్య. ఈ ఘటన ఉక్రేయిన్ లోని ఒబరివ్ జరిగింది. 49ఏళ్ల అలెగ్జాండర్ పడుకుని ఉండగా.. అతని భార్య మరియా.. అలెగ్జాండర్  గొంతు పిసికి చంపేసింది. అంతటితో ఆగక కురగాయలుకోసే కత్తితో అలెగ్జాండర్ శరీరబాగాలను వేరుచేసింది. అతడి మర్మాంగాన్ని కోసి పెంచుకుంటున్న కుక్కకు వేసింది. ఆతర్వాత భయానికి గురైన మరియా రక్తపుచేతులతో…ఇంటినుంచి బయటకు పరిగెత్తింది.

మరియా ఇంటిపక్కన ఉంటున్ననజేద ఒపనస్యుక్ అనే వృద్ధమహిళ ఏం జరిగిందని మరియాను ప్రశ్నించగా.. తాను తన భర్తను చంపేసినట్టుగా చెప్పింది. మరియా ఇంట్లోకి వెళ్లిన నజేద అలెగ్జాండర్ చనిపోయినట్లుగా నిర్దారించుకుని…. చుట్టుపక్కల వాళ్లకు చెప్పింది. దీంతో పోలీసులకు సమాచారం అందివ్వగా… ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మరియాను అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో మరియా… తన భర్త అలెగ్జాండర్ ను తానే చంపినట్లుగా ఒప్పుకుంది మరియా. అలెగ్జాండర్ పెట్టే మానసిక, శారీరక హింసను తట్టుకోలేకనే  చంపినట్లుగా పోలీసులకు చెప్పింది మరియ. చుట్టుపక్కల ఉంటున్న వాళ్లు కూడా అలెగ్జాండర్ మరియాను ఎప్పటికి కొట్టేవాడని చెప్పారు.

Latest Updates