శంషాబాద్ లో దారుణం..మహిళను హత్యచేసి తగలబెట్టారు

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ సమీపంలో మహిళ హత్య కలకలం రేపుతోంది. ఎయిర్ పోర్ట్ డిపాశ్చర్స్ కు వెళ్ళే రూట్లో మహిళను హత్య  చేసి పెట్రోల్ పోసి నిప్పంటించినట్టు తెలుస్తోంది. శంషాబాద్ ఎయిర్ పోర్ట్  రక్ష సెక్యూరిటీ అధికారుల ఫిర్యాదుతో ఏసీపీ భాస్కర్ వేముల, సీఐ విజయ్ కుమార్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం ఉస్మానియాకు తరలించారు. మృతదేహం పూర్తిగా కాలిపోయినందున గుర్తుపట్టలేని స్థితిలో ఉందని చెప్పారు. క్లూస్ టీమ్ ని రప్పించి వివరాలు సేకరించామన్నారు. పహాడీ షరీఫ్ ప్రాంతం పక్కనే ఉన్నందున ఎవరైనా మహిళ మిస్సింగ్ కేసులు నమోదయ్యాయా? అన్న కోణంలో విచారణ చేస్తున్నామని తెలిపారు. సీసీ కెమెరాలను కూడా పరిశీలిస్తున్నామని తెలిపారు.

బట్టేబాజ్ గాళ్లు తెలంగాణ గాంధీపై బక్వాస్ మాటలు మాట్లాడుతుండ్రు

Latest Updates