చదువంటాడు.. కాపురం చేయడు

భోపాల్‌‌‌‌: భర్త కొడుతున్నాడనో.. సరిగా చూసుకోలేదనో పుట్టింటికి వెళ్లే భార్యలను చూస్తాం. భోపాల్‌‌‌‌లో ఒక వింత కేసు వెలుగు చూసింది. భర్త కాంపిటీటివ్‌‌‌‌ పరీక్షలకు ప్రిపేర్‌‌‌‌‌‌‌‌ అవుతూ తనను పట్టించుకోవడం లేదని ఒక మహిళ పుట్టింటికి వెళ్లిపోయింది. కొత్తగా పెళ్లైన ఆ జంటకు అబ్బాయి చదువు ఇబ్బందిగా మారింది. తమకు విడాకులు ఇప్పించాలని కోర్టును ఆశ్రయించేలా చేసింది. మధ్యప్రదేశ్‌‌‌‌లోని భోపాల్‌‌‌‌లో కోచింగ్‌‌‌‌ సెంటర్‌‌‌‌‌‌‌‌  ఓనర్‌‌‌‌ యూపీఎస్సీ పరీక్షలకు ప్రిపేర్‌‌‌‌‌‌‌‌ అవుతున్నాడు. పూర్తిగా చదువు ధ్యాసలో పడి భార్యను పట్టించుకోవడం మానేశాడు. దీంతో తన భర్త దగ్గర ఉండలేనని చెప్పిన ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. “ కాంపిటీటివ్‌‌‌‌ పరీక్షలకు ప్రిపేర్‌‌‌‌‌‌‌‌ అవుతూ నన్ను పట్టించుకోవడం మానేశాడు. కొన్ని సార్లు చాలా వింతగా ప్రవర్తించేవారు” అని మహిళ ఆరోపించింది. అధికారులు కౌన్సిలింగ్‌‌‌‌ ఇచ్చినా ఆమె తన మనసు మార్చుకోలేదు. మహిళ భర్త పీహెచ్‌‌‌‌డీ హోల్డర్‌‌‌‌‌‌‌‌ అని, పేరెంట్స్‌‌‌‌కు ఆరోగ్యం సరిగా లేకపోవడంతో పెళ్లి చేసుకున్నాడని డిస్ట్రిక్‌‌‌‌ లీగల్‌‌‌‌ సర్వీస్‌‌‌‌ అథారిటీ ఖాన్‌‌‌‌ చెప్పారు. ఇంట్లో నుంచి వెళ్లిపోయిన మహిళ తిరిగి రాకపోవడంతో ఆమె భర్త విడాకులకు అప్లై చేశారని, ఇద్దరికి కౌన్సిలింగ్‌‌‌‌ చేసి తర్వాత కోర్టు తీర్పు ఇస్తుందని అన్నారు.

 

Latest Updates