నెలకు 16 లక్ష జీతం.. చదువు, ఎక్స్‌పీరియన్స్‌ అన్నీ ఫేక్

అత్యాశకు పోతే ఉన్నది కూడా ఊడింది. లక్షల్లో జీతం కోసం జైలు పాలైంది ఓ మహిళ. భారీ ప్యాకేజీ కోసం రెజ్యూమ్‌లో అబద్ధాలు పెట్టి.. అడ్డంగా బుక్ అయింది. జాబ్‌లో చేరిన కొన్నాళ్లకే దొరికిపోయి కటకటాల పాలైంది.

ఆస్ట్రేలియా ప్రభుత్వంలో డిపార్ట్‌మెంట్ ఆఫ్ ప్రీమియర్ అండ్ కేబినెట్‌లో చీఫ్ ఇన్‌ఫర్మేషన్ ఆఫీసర్ పోస్టు అది. ప్రభుత్వానికి సంబంధించిన సమాచారమంతా తన చేతి గుండా వెళ్లే ఆ ఉద్యోగానికి చదువు, ఎక్స్‌పీరియన్స్, రెఫరెన్స్‌లు సహా అన్ని ఫేక్ పెట్టింది. ప్రభుత్వంలో అంత పెద్ద పోస్టునే అబద్ధాలతో కొట్టేసింది ఆస్ట్రేలియాకు చెందిన వెరానికా హిల్డా (46) అనే మహిళ. బ్యాగ్రౌండ్ వెరిఫికేషన్‌లో కూడా తనకు లేని ఎక్స్‌పీరియన్స్ ఉన్నట్టు మేనేజ్ చేసింది.

నెలకే స్కాం..

ఆ ఉద్యోగంలో సంవత్సరానికి వెరానికా హెల్డా జీతం కోటీ 32 లక్షల రూపాయల పైనే. 2017 సెప్టెంబర్‌లో ఇలా ఉద్యోగంలో చేరిన ఆమె ఒక్క నెలకే తప్పు చేసి దొరికిపోయింది. తొలి నెలలో 16 లక్షల జీతం తీసుకుని, రెండో నెలలో సస్పెండ్ అయింది. అయితే ఆ కొద్ది గ్యాప్‌లోనే తన సోదరుడికి అర్హత లేకున్నా ఓ కాంట్రాక్టు కట్టబెట్టింది. దీంతో పోలీసులు హెల్డాపై కేసు పెట్టి దర్యాప్తు చేశారు. విచారణ పూర్తి చేసిన కోర్టు డిసెంబరు 3న ఆమెకు 25 నెలల జైలు శిక్ష విధించింది. అందులో 12 నెలల పాటు పెరోల్ కూడా ఇవ్వొద్దని కోర్టు తీర్పు చెప్పింది.

మానసిక ప్రవర్తనపై అనుమానం వచ్చి, ప్రభుత్వం హెల్డా వ్యవహారాన్ని గుర్తించింది. అయితే ఆమెకు స్ప్లిట్ పర్సనాలిటీ డిజార్డర్ ఉందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై పరీక్షలు చేసి అవసరమైతే నిర్భందంలో ఉంచే ట్రీట్‌మెంట్ చేయించే అవకాశాలపై అక్కడి అధికార వర్గాలు పరిశీలిస్తున్నాయి.

MORE NEWS:

నేను ఈ తరహా ఎన్‌కౌంటర్లకు వ్యతిరేకం: ఒవైసీ

స్త్రీని భోగవస్తువుగా చూడొద్దు.. మగవాడు కట్టుబాట్లు పాటించాలి

Latest Updates