వితంతువుకి గుండు గీసి.. చెప్పుల దండ వేసి..‌

ఉత్తరప్రదేశ్: ఓ వితంతువు, దివ్యాంగుడు సహజీవనం చేస్తున్నారనే ఆగ్రహంతో గ్రామస్థులు వారిద్దరికి గుండు గీసి, మెడలో చెప్పుల దండ వేసి ఊరేగించారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కన్నౌజ్ గ్రామంలో జరిగింది. కాన్పూర్ నగరానికి 100కిలో మీటర్ల దూరంలోని గురసహాయ్ గుంజ్ గ్రామానికి చెందిన 40 ఏళ్ల మహిళ భర్త మూడేళ్ల క్రితం మరణించాడు. అప్పటి నుంచి ఓ దివ్వాంగుడు వితంతువుతో సహజీవనం చేస్తున్నాడు.

దీనిపై ఆగ్రహించిన వితంతువు కుటుంబసభ్యులు, గ్రామస్థులు వారిద్దరికి గుండు గీసి, మెడలో చెప్పుల దండలు వేసి గ్రామంలో ఊరేగించారు. స‌మాచారం అందుకున్న పోలీసులు సంఘ‌ట‌న స్థ‌లానికి చేరుకుని గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు పోలీసులు.

 

Latest Updates