రెండేళ్ల క్రితం తప్పిపోయిన మహిళ సముద్రంలో సజీవంగా తేలింది (వీడియో)

అంతే నిజ జీవితంలో ఒక్కోసారి  జరిగిగే ఘటనల్ని మనం నమ్మలేం. ఇక్కడ ఇదే జరిగింది. రెండేళ్ల క్రితం ఇంటి నుంచి తప్పి పోయిన మహిళ సముద్రంలో జాలర్లకు సజీవంగా దొరికింది. ఇది వినడానికి వింతగా ఉన్నా. అక్షరాల ఇదే నిజం.

టైమ్స్ న్యూస్ నౌ కథనం ప్రకారం సెప్టెంబర్  26న రోలాండో విస్బాల్ అనే జాలరి వేటకోసం కొలంబియా సముద్రానికి వెళ్లాడు. సముద్రంలోకి వెళ్లిన 1.5కిలోమీటర్ల తరువాత 46ఏళ్ల మహిళ ఎంజెలికా గైతాన్ సజీవంగా నిటీపై తేలియాడుతూ కనిపించింది.

బాధితురాలు సముద్రంలో తేలిఆడడంపై చూసిన విస్బాల్ ఆశ్చర్యపోయాడు. ఆ ప్రదేశాన్ని వీడియో తీశాడు. వీడియోలో బాధితురాలు సముద్రంలో తేలియాడుతున్నట్లు ఆపస్మారక స్థితిలో ఉండడం మనం వీడియోలో గమనించవచ్చు.

అయితే  మహిళ ఎంజెలికాను చూసిన వెంటనే ఆమెను సముద్రంలోకి దిగి పడవలోకి తీసుకొచ్చారు. అనంతరం స్పృహలోకి వచ్చిన ఆమె దేవుడు నన్ను చంపలేదు. నేను బ్రతికే ఉన్నానంటూ ఆనందం వ్యక్తం చేసింది. మెల్లగా ఆమెను పడవలో నుంచి ఒడ్డుకు తెచ్చారు. అనంతరం అక్కడ ఆమెకు వాటర్ తాగించి ఆస్పత్రికి తరలించారు. అయితే కాస్తకుదుటపడ్డ తరువాత ఆమె గురించి ఆరా తీయగా  2018  చివరలో ఆమె తన భర్త నుంచి పారిపోయినట్లు తెలిపింది. బంధువులు, భర్త తనని చిత్రహింసలకు గురిచేసినట్లు మీడియాకు తెలిపింది. తనని తన భర్త ఇంటి బాత్రూంలో ఉంచి వేధించినట్లు తెలిపింది. ఆ వేదింపులకు తాళలేక ఇంటినుంచి పారిపోయిన బాధితురాలు ఆరు నెలల పాటు రోడ్ల పైనే జీవించింది. ఆ తరువాత రెస్క్యూ హోంలో ఉండగా అక్కడ తనకు వేధింపులకు గురైనట్లు తెలిపింది. అక్కడి నుంచి మళ్లీ తప్పించుకోగా…మరి సముద్రంలో ఎలా పడింది అనేది సస్పెన్స్ గా మారింది.

Amigos les comparto todos los vídeos que logré al momento del rescate en Altamar de Angélica Gaitan frente a las costas del municipio de Puerto Colombia el día sábado 26 de Septiembre de 2020 !

Rolando Visbal Lux यांनी वर पोस्ट केले मंगळवार, २९ सप्टेंबर, २०२०

Latest Updates