కూకట్‌ పల్లిలో ఇద్దరి పిల్లలతో వివాహిత అదృశ్యం

హైదరాబాద్: ఇద్దరి పిల్లలతో వివాహిత అదృశ్యమైన సంఘటన శుక్రవారం హైదరాబాద్ లో జరిగింది.  కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజీవ్‌ గాంధీ నగర్‌కు చెందిన వివాహిత మానస అదృశ్యమైంది. ఇద్దరు పిల్లలతో వెళ్లిన ఆమె కనిపించట్లేదు. ఇద్దరు పిల్లలు తేజ(9), యస్విక (8)లతో కలిసి తల్లి గారింటికి బయలుదేరి వెళ్లింది. మానస మాత్రం పుట్టింటికి చేరలేదు. ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. ఆందోళన చెందిన భర్త పరమేష్ కూకట్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.  మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు పోలీసులు.

 

Latest Updates