కాటేసింది : ఫోన్ మాట్లాడుతూ పాములపై కూర్చుంది

ఫొన్ మాట్లాడుతూ రైలు ప్రమాదాల్లో ఎంతో మంది మరణించిన ఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఓ మహిళా ఫోన్ మాట్లాడుతూ అజాగ్రత్త వహించడంతో పాము కాటుకు గురై చనిపోయింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో జరిగింది. గోరక్‌పూర్‌, రివాయ్ గ్రామానికి చెందిన జయసింగ్ థాయ్‌ ల్యాండ్‌ లో ఉంటాడు. అక్కడి నుంచి ఆయన రివాయ్ గ్రామంలో ఉండే తన భార్య గీతకు బుధవారం ఫోన్ చేశాడు.

భర్తతో ఫోనులో మాట్లాడుతూ పక్కనే ఉన్న మంచంపై కూర్చుంది గీత. అయితే అప్పటికే ఆ మంచంపై రెండు పాములున్నాయి. ఆమె చూసుకోకుండా వాటిపైననే కూర్చుంది. దీంతో ఒక పాము ఆమెను కాటువేసింది. గమనించిన స్థానికులు గీతను హస్పిటల్ కి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ గురువారం మృతి చెందింది.

Latest Updates