కల్యాణలక్ష్మి డబ్బు కోసం మహిళ హత్య

షాద్‌నగర్‌, వెలుగు: అక్రమ సంబంధం ఓ మహిళ ప్రాణాలను బలిదీసుకుంది. షాద్​నగర్ ఏసీపీ సురేందర్ తెలిపిన ప్రకారం.. రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలంలోని తొమ్మిదిరేకుల గ్రామానికి చెందిన రాములు, చెన్నమ్మ(40) దంపతులకు ముగ్గురు పిల్లలు. అదే మండలంలోని పోమాల్‌పల్లికి చెందిన పోలేపోగు జంగయ్య(45)తో చెన్నమ్మకి ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. షాద్‌నగర్‌లో పండ్ల వ్యాపారం చేస్తున్న చెన్నమ్మ  ఈ నెల 22న కనిపించకుండా పోయింది. ఆమె కొడుకు శివ షాద్‌నగర్ పీఎస్​లో కంప్లయింట్ ​చేశాడు. పోలీసులు సోమవారం జంగయ్యని అదుపులోకి తీసుకుని విచారించడంతో హత్య విషయం వెలుగుచూసింది. ఇటీవల చెన్నమ్మ కూతురి పెండ్లి జరగడంతో కల్యాణలక్ష్మి చెక్కు వచ్చింది. దాన్ని బ్యాంకులో వేసేందుకు ఆమె, జంగయ్య 22న తలకొండపల్లికి వెళ్లారు. బ్యాంకులో పని అయ్యాక మందు తీసుకుని మల్లప్పగుట్టపైకి వెళ్లారు. చెన్నమ్మ కూతురు పెండ్లికి జంగయ్య లక్ష రూపాయలు అప్పుగా ఇచ్చాడు. కల్యాణలక్ష్మి చెక్కు రావడంతో ఆ డబ్బు తనకి ఇవ్వాలని పట్టుబట్టాడు. దాంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. జంగయ్య బండరాయితో తలపై బాదడంతో చెన్నమ్మ చనిపోయింది. పోలీసులు మంగళవారం స్పాట్​కి వెళ్లి డెడ్​బాడీని పోస్టుమార్టం కోసం తరలించారు. జంగయ్యపై గతంలో కేసులు ఉండడంతో రౌడ్​షీట్ ​ఓపెన్​చేసి రిమాండ్​కి తరలించారు.

For More News..

ఓటేయాలంటే కరోనా టెస్ట్ చేయించుకోవాల్సిందే

ఇండియాకు గుడ్ బై చెప్పిన ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్

15 రోజులు పోరాడి ఓడిన మరో నిర్భయ

Latest Updates