కుక్కల్ని కాపాడితే ..ఇలా కొడతారా

కుక్కల్ని కాపాడుతున్నారనే అకారణంగా కొంతమంది దుండగులు తనని, తన స్నేహితుల్ని ఇష్టం వచ్చినట్లు కొట్టారంటూ ఓ యువతి పోలీసుల్ని ఆశ్రయించింది.

కరోనా కారణంగా మనుషులకు పూట గడవడమే కష్టంగా మారింది. అలాంటిది మూగ జీవాల పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఊహించుకోండి. అందుకే కొన్ని స్వచ్ఛంద సంస్థలు మూగ జీవాలకు అండగా నిలుస్తున్నాయి. వాటి ఆలన పాలన చూసుకుంటున్నాయి.  ఢిల్లీకి చెందిన అయేషా అనే యువతి తన స్నేహితులతో కలిసి ఓ ఎన్టీవోని నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో  రాణీ బాగ్ ప్రాంతంలో ఆకలితో అలమటిస్తున్న కుక్కల్ని అక్కున చేర్చుకునే ప్రయత్నం చేసింది అయేషా. ఈ క్రమంలో గుర్తు తెలియని దుండగులు కుక్కల్ని ఎందుకు కాపాడుతున్నారంటూ ఆమెపై, ఆమె స్నేహితులపై విచక్షణ రహితంగా దాడి చేశారు. ఈ దాడిలో ఆయేషా  ఆమె స్నేహితులు తీవ్రంగా గాయపడ్డారు. దాడి అనంతరం బాధితురాలి తన స్నేహితులతో కలిసి స్థానికంగా ఉన్న పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఈ సందర్భంగా బాధితురాలు మాట్లాడుతూ మూగజీవాల్ని కాపాడితే ఈ రకంగా దాడి చేస్తారా అంటూ ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇకపై ఎవరైనా దాడిచేస్తే మీ సపోర్ట్ మాకు కావాలంటూ నెటిజన్లను కోరింది. బాధితురాలి వీడియోపై స్పందించిన నెటిజన్లు..నిందితుల్ని వెంటనే అరెస్ట్ చేయాలని పోలీసుల్ని డిమాండ్ చేస్తున్నారు.

 

Latest Updates