డ్రైనేజీ గుంతలో నిరసన

అనుమతులు లేకుండా అక్రమ డ్రైనేజీ పైపులైను నిర్మాణం చేపట్టవద్దంటూ మహిళా మండలి నేత అరుణ నాలుగు రోజులుగా డ్రైనేజీ పైపులైను గుంతలోనే కూర్చుని నిరసన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ మాదాపూర్​ డివిజన్​ గోకుల్ ప్లాట్స్ భూముల్లో ఎటువంటి నిర్మాణాలు చేపట్టవద్దని కోర్టు ఉత్తర్వులున్నప్పటికీ.. బిల్డర్లు ఇష్టానుసారంగా నిర్మాణాలు చేపడుతున్నారని ఆరోపించారు. వెంకటరమణ కాలనీలో కొందరు ఎలాంటి పర్మిషన్ లేకుండా రాత్రికి రాత్రే  డ్రైనేజీ కోసం రోడ్డును తవ్వి ఒక ఫీట్ డ్రైనేజీ పైపులైన్ ను 6 ఇంచులు ఉన్న డ్రైనేజీ పైపులైన్​కు కలిపారని.. దీంతో  డ్రైనేజీ పొంగినప్పుడు తమ ఇళ్లల్లోకి, కాలనీ రోడ్ల మీదకు మురుగు వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. – మాదాపూర్, వెలుగు

Woman protest in Drainage pothole to stop improper drainage pipeline construction

Latest Updates