ఏసీబీకి చిక్కిన మహిళా పబ్లిక్ ప్రాసిక్యూటర్

Woman public Prosecutor caught by ACB officials

15 వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్న అధికారులు

రాజేంద్రనగర్, వెలుగు: హైదరాబాదు శివారు రాజేంద్రనగర్ లోని ఎనిమిదో మెట్రో పాలిటన్ కోర్టులో అవినీతి నిరోధక శాఖ అధికారుల దాడులు నిర్వహించారు. బాధితులకు న్యాయం‌‌‌‌ చేయాల్సిన పబ్లిక్ ప్రాసిక్యూ టర్ ప్రసన్న లక్ష్మి15 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికింది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండల పరిధిలోని కిస్మత్ పూర్ లో రజితా దేవి అనే మహిళ ఖాళీ స్థలాన్నికొనుగోలు చేసింది. రాజేంద్రనగర్ సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ కూడా చేయించుకుంది. కొంత కాలానికి సదరు మహిళ కొనుగోలు చేసిన ప్లాట్ ను ఓరియల్ ఎస్టేట్ వ్యాపారి కబ్జా చేశాడు. దీంతో బాధితురాలు తను కొనుగోలు చేసిన స్థలాన్నికబ్జా చేశారని తనకు న్యాయం చేయాలని రాజేంద్రనగర్ లోని ఉప్పర్ పల్లి ఎనిమిదో మెట్రోపాలిటన్ కోర్టును ఆశ్రయించింది.తన ఫిర్యాదును స్వీకరించిన కోర్టు కేసును వేగవంతం చేసింది.

బాధితురాలి తరపున కేసును పబ్లిక్‌‌‌‌ ప్రాసిక్యూటర్ ప్రసన్న లక్ష్మి వాదిస్తోంది. ఈ నేపథ్యంలో బాధితురాలికి న్యాయం చేస్తానని పబ్లిక్ ప్రాసిక్యూ టర్ 20వేలు లంచం అడిగింది. బాధితురాలు అంత ఇవ్వలేనంటే కనీసం 15 వేలైనా ఇవ్వాలని ప్రసన్న లక్ష్మి డిమాండ్ చేసింది. ఈ అన్యాయాన్ని భరించలేక బాధితురాలు ఏసీబీ ని ఆశ్రయించింది. దీంతో రంగంలోకి దిగిన అధికారులు ఉప్పర్ పల్లి కోర్టుకు చేరుకున్నారు. 15 వేల రూపాయలు బాధితురాలికి ఇచ్చి పంపారు. ప్రసన్న లక్ష్మికి బాధితురాలు నగదు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నా రు. కేసు నమోదు చేసిన అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆమెను అరెస్టు చేసి తదుపరి విచారణ నిమిత్తం తమ కార్యాలయానికి తీసుకెళ్లారు.ఈ విషయం తెలిసిన మరికొంతమంది ప్రసన్న లక్ష్మి బాధితులు ఆమె తమ వద్ద కూడా లంచం తీసుకుందని మీడియాకు తెలిపారు.

Latest Updates