అత్తపై అల్లుడి అత్యాచారం

నిందితుడిని అరెస్ట్ చేసిన చంద్రాయణగుట్ట పోలీసులు

హైదరాబాద్, వెలుగు: అత్తపై అల్లుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన చంద్రాయణగుట్ట పీఎస్ పరిధిలో జరిగింది. ఎస్సై జాకీర్ కథనం ప్రకారం..కందికల్ బస్తీకి చెందిన ఓ మహిళ(40) తన కూతురిని బాలాపూర్ చౌరస్తాలో ఉండే భాస్కర్(27)కి ఇచ్చి పెళ్లి చేసింది. భాస్కర్ బుధవారం ఎవరూ లేని సమయంలో పని ఉందని చెప్పి అత్తను  బయటికి తీసుకెళ్లాడు. చెరువుకట్ట దగ్గరికి తీసుకెళ్లి అక్కడ ఆమెపై అత్యాచారం చేశాడు. దీంతో ఆ మహిళ అల్లుడు భాస్కర్ పై చంద్రాయణగుట్ట పోలీసులకు కంప్లయింట్ చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు భాస్కర్ ను రిమాండ్ కి తరలించారు.

Latest Updates