దారుణం.. లిఫ్ట్ ఇస్తానని చెప్పి అత్యాచారం

భువనేశ్వర్ : ఒడిశాలోని ఖుర్దు జిల్లాలో దారుణం జరిగింది. బస్ స్టాపులో బస్సు కోసం వేచి చూస్తున్న యువతికి లిఫ్టు ఇస్తానని చెప్పి ఓ వ్యక్తి  కారులో ఎక్కించుకొని ఆమెపై అత్యాచారం చేశాడు. ఈ కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

భువనేశ్వర్‌ డీసీపీ అనూప్‌ కె సాహూ ఈ ఘటనపై మాట్లాడుతూ..  ఖుర్ధా జిల్లాలోని PN కాలేజీ సమీపంలో ఓ యువతి ఒంటి నిండా గాయాలతో, చిరిగిన దుస్తులతో రోడ్డుపక్కన పడి ఉన్నట్టు సమాచారమందిందని చెప్పారు. వెంటనే సంఘటనా స్థలికి చేరుకొని పరిశీలించగా ఆమె అత్యాచారానికి గురైందని గుర్తించామని, వెంటనే చికిత్స కోసం ఆస్పత్రికి తరలించామని చెప్పారు. దీనికి కారణం తెలుసుకొని ఈ దారుణానికి పాల్పడ్డ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని, ఆ కారును కూడా సీజ్ చేయడం జరిగిందని చెప్పారు.

కదులుతున్న కారులోనే ఆమె అత్యాచారానికి గురైందని కుర్దా గ్రామీణ ఎస్పీ అజయ్‌ ప్రతాప్‌ స్వైన్‌ అన్నారు. ఈ ఘటనతో యువతి తీవ్ర షాక్ కి గురైందని, ప్రస్తుతం  జిల్లా ఆస్పత్రిలో  ఆమెకు చికిత్స జరుగుతోందని చెప్పారు. బాధితురాలు కోలుకున్నాకే ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుస్తాయని ఎస్పీ తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.

Woman 'Raped' in Moving Car, Dumped Near College in Odisha

మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ను ఫాలో అవ్వండి

Latest Updates