వీడియో: బావిలో పడిన కుక్కను ఓ మహిళ ఎలా కాపాడిందంటే..

మంగళూరులో ఓ శునకం ఎలా పడిందో కానీ బావిలో పడింది. దాన్ని ఓ మహిళ కాపాడింది. రెండు నిమిషాల నిడివి గల ఆ వీడియోను మౌనా అనే ట్విట్టర్ యూజర్ తన పేజీలో షేర్ చేశారు. అది ఇప్పుడు వైరల్‌గా మారింది. దాదాపు 16,000 మందికి పైగా వీక్షించారు.

బావిలో పడిన కుక్కను బయటకు తీయడానికి మహిళ ఒక తాడును తన నడుముకు కట్టుకొని బావిలోకి దిగింది. ఆ తర్వాత బావి పైన ఉన్నవాళ్లు మరో తాడును బావిలోకి వేశారు. ఆ తాడును కుక్కకు బిగించి పైకి లాగమని చెప్పింది. పైన ఉన్న వాళ్లు వెంటనే కుక్కను పైకి లాగారు. బయటకి వచ్చిందో లేదో ఆ కుక్క ఒకటే పరుగో పరుగు.

అక్కడున్నవాళ్లు తాడును మళ్లీ బావిలోకి వేయడంతో ఆమె రెండు తాళ్ల సహాయంతో అతి కష్టం మీద బావి పైకి చేరుకుంది. ఈ వీడియోను పోస్టు చేసిన యూజర్ ‘కుక్కను కాపాడిన లేడీని ఆశీర్వదించండి’ అని క్యాప్షన్ పెట్టారు.

తన ప్రాణాలను పణంగా పెట్టి కుక్కను కాపాడినందుకు నెటిజన్లు ఆ మహిళను ప్రశంసిస్తూ.. ఆ వీడియోకు తెగ లైకులు కొడుతున్నారు. కుక్కను కాపాడిన ఆ మహిళ నాకు ఒక హీరోతో సమానం అని ఒక యూజర్ కామెంట్ చేశారు. మనం ఏదో ఒక రోజు జంతువుల పట్ల ప్రేమగా మారతామని, జంతు వధను వదిలేస్తామని మరోక యూజర్ కామెంట్ చేశారు.

For More News..

భార్య తల నరికి చేతిలో పట్టుకొని జాతీయగీతం

ఢిల్లీ చేరిన రెండో కరోనా ఫ్లైట్

భారత్‌లో రెండో కరోనా కేసు నమోదు

Latest Updates