హిజ్రాలుగా మారి దారిదోపిడీ చేస్తున్న ముఠా..!

ఆంధ్ర ప్రదేశ్: హిజ్రాల వేషంలో దారిదోపిడీలు చేస్తున్న ముఠాను అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ ఘటన.. ఆంధ్ర ప్రదేశ్ లోని నెల్లూరు జిల్లాలో జరిగింది. ముఠాలో నలుగురు సభ్యులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వీరు  నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని ఆకుతోట వీధికి చెందిన శ్రీరామ్, అమాస్య వెంకటరమణ, అమాస్య రాజా, కంపా వెంకటేశ్వర్లు గా చెప్పారు. ఈ నలుగురిలో ఒకరు ఆడవాళ్లలాగా తయారై… రోడ్డుపై పోయే బండ్లను ఆపి వారి వద్దనున్న నగదును, బంగారాన్ని దోచుకునే వారని తెలిపారు. సక్రాంతి సందర్భంగా ఖర్చులకోసం దొపిడీ చేస్తున్న వీరిని.. మాటు వేసి పట్టుకున్నట్లు తెలిపారు పోలీసులు. వారిని అరెస్ట్ చేసి దోచుకున్న సొమ్మును స్వాధీనం చేస్తుకున్నట్లు  CI వేణుగోపాల్ తెలిపారు.

 

Latest Updates