మ‌న‌స్థాపానికి గురై మ‌హిళా సర్పంచ్ ఆత్మహత్యాయత్నం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: పంచాయతీ నిధులు దుర్వినియోగం అయ్యాయని పాలకవర్గ సభ్యులు విమర్శలు చేస్తూ నిలదీయడంతో మనస్థాపానికి గురైన ఓ మ‌హిళా సర్పంచ్ ఉరి వేసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్ప‌డింది. ఈ సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కారేపల్లి లో చోటు చేసుకుంది. గత పంచాయతీ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ నుంచి స‌ర్పంచ్ గా పోటీ చేసి గెలిచిన ఆదేర్ల స్రవంతి.. 30 రోజుల ప్రణాళిక లో ప్ర‌భుత్వం నుంచి వచ్చినటువంటి నిధులను దుర్వినియోగం చేశార‌న్న ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటోంది. 27 లక్షలలో 22 లక్షలు దుర్వినియోగం అయ్యాయని పాలకవర్గం 7 నెలలుగా సర్పంచ్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో గతంలో కూడా రెండుసార్లు స్ర‌వంతి ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. విమర్శలు కొనసాగుతున్న క్ర‌మంలో శ‌నివారం ఉరి వేసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. మెరుగైన వైద్యం కోసం ఆమెను ఖమ్మం ఆసుపత్రికి తరలించారు.

Woman Sarpanch commits suicide attempt over allegations of misappropriation of funds

Latest Updates