పెళ్లికూతురుకి పుస్తెమెట్టెలు గిఫ్ట్ గా ఇచ్చిన మహిళా సర్పంచ్

యాదాద్రి భువనగిరి జిల్లా : వధువుకు పుస్తెమెట్టెలు గిఫ్ట్ గా అందజేసి మంచి మనసు చాటుకున్నారు వీరవెల్లి గ్రామానికి చెందిన మహిళా సర్పంచ్ కల్పనశ్రీనివాస్. శుక్రవారం అదే గ్రామానికి చెందిన సర్దార్ జహంగీర్, శోభ కూతురు కీర్తి వివాహం.. నవీన్ కుమార్ తో జరిగింది. ఈ సందర్భంగా పెళ్లికి హాజరైన ఆమె.. పెళ్లి కూతురికి బంగారు పుస్తె..వెండి మెట్టెలు.. బట్టలు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన సర్పంచ్ కల్పన.. వీరవెల్లి గ్రామంలో ప్రతి ఆడబిడ్డ పెళ్లికి ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ తంగెళ్లపల్లి శ్రీనివాసచారి, ఉప సర్పంచ్ కరిమలమ్మ జార్జి, సర్దార్ శ్రీను, శ్రీశైలం, బీమరి మశ్చెందర్, సోకం అశోక్ తదితరులు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.

Latest Updates