జేసీబీతో మహిళ సర్పంచ్ ఫైట్

ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించారు ఓ మహిళా సర్పంచ్. తమ గ్రామపంచాయితీ స్థలాన్ని ఆక్రమించుకునేందుకు చేసిన ప్రయత్నాన్ని ఒంటరిగా ఎదుర్కోవడంతో పాటు వచ్చిన అధికారులను గ్రామం నుంచి పరుగులు పెట్టించారు. ఈ ఘటన రాజస్తాన్ లో జరిగింది.

రాజస్తాన్‌లోని మండ్వాలా గ్రామ సర్పంచ్ రేఖా దేవి. అయితే ఆ గ్రామానికి చెందిన గ్రామపంచాయితీలో నిర్మించిన కట్టడాలను…అక్రమ కట్టడాలుగా నిర్ణయించింది రాష్ట్ర ప్రభుత్వం. దీంతో ఆ నిర్మాణాలను కూల్చేసి…ఆ భూమిని సొంతం చేసుకునేందుకు అధికారులను ఆదేశించింది. దీంతో అధికారులు జేసీబీలతో మండ్వాలా గ్రామానికి చేరుకున్నారు. జేసీబీలతో అక్కడున్న భవనాలను కూల్చేందుకు సిద్ధమయ్యారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన సర్పంచి రేఖా దేవి.. అడ్డుకున్నారు. వెంటనే ఇక్కడి నుంచి వెనక్కి వెళ్లిపోవాలంటూ హెచ్చరించారు. అయినా పట్టించుకోకుండా కూల్చేందుకు ప్రయత్నస్తుండటంతో జేసీబీ కొక్కాన్ని పట్టుకుని వేలాడారు. దీంతో ఆందోళనకు గురైన జేసీబీ డ్రైవర్లు వెనక్కి తగ్గారు.

అది గ్రామ పంచాయతీకి చెందిన భూమి అని..దీన్ని ఆక్రమించుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందంటూ ఆరోపించారు సర్పంచ్ రేఖాదేవి. గతంలోనూ ఇలాంటి ప్రయత్నాలే చేసిందని చెప్పారు.

Latest Updates