రికార్డ్ కు ఒక్క అడుగే!

లండన్: రెండేళ్లుగా ఊరిస్తున్న మహిళల సింగిల్స్‌‌ అత్యధిక టైటిళ్ల రికార్డును సాధించాలనే లక్ష్యంతో అమెరికా నల్ల కలువ సెరెనా విలియమ్స్‌‌ శనివారం వింబుల్డన్​ఫైనల్లో బరిలోకి దిగుతోంది. తుది పోరులో ప్రపంచ మాజీ నం.1, సిమోనా హలెప్‌‌ (రొమేనియా)తో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ మ్యాచ్‌‌లో నెగ్గితే ఓపెన్‌‌ ఎరాలో అత్యధిక సింగిల్స్‌‌ టైటిల్స్‌‌ నెగ్గిన మార్గరెట్‌‌ కోర్ట్‌‌ (ఆస్ట్రేలియా) రికార్డును సెరెనా సమం చేస్తుంది.  ప్రస్తుతం 23 టైటిళ్లతో కొనసాగుతున్న అమెరికన్.. గతేడాది వింబుల్డన్‌‌, యూఎస్‌‌ ఓపెన్‌‌ గ్రాండ్‌‌స్లామ్‌‌ టోర్నీల్లో ఫైనల్​కు చేరినా టైటిల్స్​ను గెలవలేకపోయింది. ప్రస్తుతం అద్భుత ఫామ్​లో ఉన్న సెరెనా.. ఫైనల్​కు చేరే క్రమంలో నలుగురు సీడెడ్​ప్లేయర్లను ఓడించింది. హలెప్​తో ముఖాముఖి పోరులోనూ 9–2తో ఆధిక్యంలో ఉంది. కాబట్టి ఈ మ్యాచ్​లో గెలిచి 24వ టైటిల్​ నెగ్గాలని భావిస్తోంది.

 

Latest Updates