షాకింగ్ వీడియో..  బైక్‌ పైనుంచి పడి కారు కింద ఇరుక్కున్న మహిళ

కారు కింద చిక్కుకున్న మహిళను స్థానికులందరూ కలిసి ఆ కారును ఎత్తి కాపాడారు. ఆ ప్రమాద వీడియో చూస్తే సదరు మహిళ బతకటం కష్టమనే అనుకుంటారు. కానీ, చిన్న చిన్న గాయాలతో ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది. చైనాలోని లియుజౌ నగరంలో ఈ ఘటన జరిగింది. జువాంగ్ అటానమస్ రీజియన్‌లో బిజీగా ఉన్న రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. వీడియో ప్రకారం.. ఒక మహిళ ఎలక్ట్రిక్ బైక్‌పై వెళ్తూ.. అకస్మాత్తుగా స్కిడ్ అయి కిందపడింది. ఆమె వెనుకనుంచి వచ్చిన కారు కంట్రోల్ కాక.. ఆమె పైనుంచి వెళ్లింది. దాంతో మహిళ ఆ కారు కింద పడి.. కారుతో పాటే ముందుకు వెళ్లింది. అది చూసిన స్ధానికులు వెంటనే కారు వద్దకు వచ్చి ఆమెను బయటకు తీయడానికి ప్రయత్నించారు. కానీ, ఆమె బయటకు రాలేదు. వెంటనే అందరూ కలిసి కారును ఎత్తి.. ఆ మహిళను బయటకు తీశారు. అందరూ ఆ మహిళకు తీవ్ర గాయాలై ఉంటాయని అనుకున్నారు. తీరా చూస్తే స్వల్ప గాయాలతో మహిళ బయటపడింది. వెంటనే దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు.

చైనాలో ఇటువంటి ప్రమాదాలు జరగడం ఇదే మొదటిసారి కాదు. గత ఏడాది జూలైలో సుకియాన్ సిటీలో కూడా ఇటువంటి ఘటనే జరిగింది. మినీ బస్ కింద పడిన మహిళను స్థానికులందరూ కలిసి బస్సును ఎత్తి కాపాడారు.

Latest Updates