ఇంట్లో గొడవలు..వివాహిత ఆత్మహత్య

woman-suicide-with-fightings-at-home

యాదాద్రి భువనగిరి జిల్లా, బొమ్మలరామారం మండలం రంగాపురం గ్రామంలో మంగళవారం విషాదం చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో ఏడాదిన్నర వయసున్న తన కూతురుతోపాటు తల్లి కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని హత్మహత్యకు పాల్పడింది. బొమ్మలరామారం మండలం పెద్దపర్వతాపురం గ్రామానికి చెందిన హైమావతికి అదే మండలం రంగాపురం గ్రామానికి చెందిన మర్రి శ్యాంసుందర్​రెడ్డితో మూడేండ్ల కింద పెళ్లి జరిగింది. వీరికి ఏడాదిన్నర పాప నందిక(18 నెలలు) ఉంది. అయితే కొన్నిరోజులుగా ఈ దంపతుల మధ్య కలహాలు వస్తుండటంతో హైమావతి తీవ్ర మనస్తాపానికి గురైంది. మంగళవారం ఇంట్లో ఎవరు లేని సమయంలో తాను వంటిపై కిరోసిన్​ పోసుకొని, తనతో పాటు తన పాపకు కూడ కిరోసిన్​ పోసి నిప్పంటించుకుంది. అదే సమయానికి భర్త బయటి నుంచి వచ్చి డోర్​ తీయడంతో ఇద్దరు కాలిపోతూ కనిపించారు. అప్పటికే హైమావతి చనిపోయింది.  చిన్నారిని ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందింది. మృతదేహాలను పోస్ట్​మార్టం నిమిత్తం భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు.

హైమావతి కుటుంబసభ్యుల ఆందోళన…

హైమావతి ఆత్మహత్య చేసుకోలేదని, అత్తింటివాళ్ళే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని ఆరోపిస్తూ ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు భర్త శ్యాంసుందర్​రెడ్డి ఇంటి ముందు ఆందోళన నిర్వహించారు. ఇంటి కిటికీలు, అద్దాలను ధ్వంసం చేశారు. పోలీసులు అడ్డుకుని,  ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.

Latest Updates