భర్త వేధింపులు భరించలేక భార్య ఆత్మహత్య

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం రాళ్లగూడలోని సీఎస్కె విల్లాలో లావణ్య అనే వివాహిత ఆత్మహత్య చేసుకుంది. భర్త వేధింపులు తట్టుకోలేక ఉరి వేసుకొని చనిపోయినట్లు సమాచారం. లావణ్య భర్త పైలెట్ గా పనిచేస్తున్నాడు. అతడు మరో అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకొని భార్యను తీవ్రంగా హింసించేవాడు. దాంతో తీవ్ర మనస్తాపానికి గురైన లావణ్య.. ఇంట్లో ఎవరు లేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికుల సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. లావణ్య భర్తపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

For More News..

పోలీసు కస్టడీకి ఎస్ఐ, ఇన్ చార్జీ తహశీల్దార్, సర్పంచ్

ఐటీ ఆన్‌లైన్‌ కోర్సులకు మస్తు డిమాండ్

చైనా మాల్‌ తగ్గించేందుకు కొత్త ప్లాన్

Latest Updates