సిద్ధూపై చెప్పు విసిరిన మహిళ

పంజాబ్‌ మంత్రి, మాజీ క్రికెటర్‌ నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూపై ఓ మహిళ చెప్పువిసిరింది. హర్యాణాలో ఓ పబ్లిక్‌ మీటింగ్‌ సందర్భంగా ఈ ఘటన జరిగింది. వెంటనే ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

రోహతక్‌ ఎంపీ అభ్యర్థి దీపేందర్‌ హుడాకు మద్దతుగా మంగళవారం రాత్రి ఎలక్షన్ క్యాంపెయిన్ నిర్వహించారు. అయితే ఆ వేదికపై సిద్ధూ మాట్లాడుతూ మోడీపై వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో అక్కడే ఉన్న ఓ మహిళకు కోపం వచ్చింది. సిద్ధూ పైకి చెప్పును విసిరికొట్టింది. ఎన్నికల ప్రచారంలో మోడీని దొంగగా అభివర్ణిస్తూ మాట్లాడబోయారు సిద్దూ. మంగళవారం రాత్రి ఈ ఘటన జరిగినా.. ఇవాళ(గురువారం) రోజు ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మోడీకి వ్యతిరేకంగా మాట్లాడినందుకే సిద్దూపై చెప్పుతో దాడి చేసినట్లు ఆ మహిళ స్పష్టం చేశారు. సిద్ధూపై చెప్పుతో దాడి చేసిన తర్వాత.. అదే వేదిక దగ్గర మోడీకి అనుకూలంగా నినాదాలు చేశారు ఆ మహిళ.

Latest Updates