భర్త పట్టించుకోలేదని.. 17వ అంతస్థు నుంచి పసికందును విసిరేసిన తల్లి

ముంబైలో దారుణం జరిగింది. భర్త తనని సరిగ్గా చూసుకోవడం లేదని కోపం అప్పుడే పుట్టిన నవజాత శిశువును తల్లి 17వ అంతస్థు నుంచి కిందకు విసిరేంసింది.

ముంబైలోని కందివాలిలోని జైభారత్ సొసైటీ, ఎస్ఆర్ఏ భవనం ఆవరణంలో సాయంత్రం 4 గంటల సమయంలో శిశువు చనిపోయినట్లు పోలీసులకు సమాచారం అందింది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు రక్తంమడుగులో పడి ఉన్న పసికందును అత్యవసర చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.

అనంతరం కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. విచారణలో భాగంగా 17వ అంతస్థులో ఉన్న ఓ మహిళ తన బిడ్డను కిందకు విసిరేసినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు.

పసికందు తల్లిని విచారించగా భార్య- భర్తల మధ్య గతకొద్దికాలంగా మనస్పర్ధలు తలెత్తినట్లు తెలుస్తోంది. బాత్రూంలో బిడ్డకు జన్మనిచ్చినట్లు..జాగ్రత్తగా చూసుకోవాల్సిన భర్త పట్టించుకోకపోవడంతో ఈ దారుణానికి ఒడిగట్టినట్లు చెప్పింది. నిందితురాలి స్టేట్మెంట్ ను రికార్డ్ చేసుకున్న పోలీసులు భర్తను విచారించేందుకు సిద్ధమయ్యారు.

Latest Updates