డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ కు అవమానం..కూల్ డ్రింక్ తో దాడి చేసిన యువతి

కరోనా వైరస్ పై దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్న డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ కు అవమానం జరిగింది.

భారత సంతతికి చెందిన ఐర్లాండ్‌ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ డాక్టర్ లియో వరద్కర్ కరోనా వైరస్ కేసులు పెరగడంపై డుబ్లిన్ లో మీడియాతో మాట్లాడారు. ఆ సమయంలో మాస్క్ ధరించిన ఓ యువతి డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ వరద్కర్ మొహం పై కూల్ డ్రింక్ విసిరింది. అనంతరం అక్కడి నుంచి పారిపోయింది.

ఈ ఘటనపై వరద్కర్ మాట్లాడుతూ కరోనా వైరస్ ను ఉద్దేశించి మీడియాతో మాట్లాడుతుండగా ఓ మహిళ కూల్ డ్రింక్ విసిరింది. సంతోషించాల్సిన విషయం ఏంటంటే..కరోనా వైరస్ పై ప్రజలకు ఏం చెప్పాలనుకున్నానో ముందే చెప్పాను. దాడితో తనకు అదనపు భద్రత కావాలని తాను కోరడం లేదన్నారు.

దీనిని ఐరిష్ నాయకులు తీవ్రంగా ఖండిస్తున్నారు. మాజీ అధ్యక్ష అభ్యర్థి గావిన్ డఫీ..లియో వరద్కర్ ఈ దాడి మీ పైన జరిగింది కాదు. ఇది మన ప్రజాస్వామ్యంపై దాడి. యువతిపై మీపై విసిరింది కాఫీ అని తెలిసింది. అదే యాసిడ్ అయితే ఏం చేసేవాళ్లం.మన నాయకులను మనమే రక్షించుకోవాలని పిలుపునిచ్చారు. కాగా ఈ సంఘటనపై ఐరిష్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.

Latest Updates