ట్రెక్కింగ్‌‌కు వెళ్లిన మహిళ ఏనుగు దాడిలో మృతి

ట్రెక్కింగ్‌‌కు వెళ్లిన ఓ మహిళ ఏనుగు దాడిలో చనిపోయింది. కోవై గణపతి సమీపంలో నివస్తున్నారు ప్రశాంత్‌,భువనేశ్వరి దంపతులు. భువనేశ్వరి శంకర కంటి ఆస్పత్రిలో అడ్మినిస్ట్రేటివ్  ఆఫీసర్ గా పనిచేస్తోంది. ఆదివారం ఉదయం పెరియనాయకన్‌పాళయం సమీపంలోని కొండలను ఎక్కేందుకు స్నేహితులతో కలసి ట్రెక్కింగ్‌కు వెళ్లారు ప్రశాంత్‌,భువనేశ్వరి దంపతులు. కొండ దిగువ భాగంలో కారును నిలిపిన వారు అక్కడి నుంచి కుళుంజూర్‌పతి కొండ గ్రామానికి వెళ్లారు. అక్కడి నుంచి 3 కి.మీ దూరంలో ఉన్న మాంగుళి అనే గ్రామానికి వెళ్లేందుకు రెడీ అయ్యారు. దారి మధ్యలో వీరిని ఓ ఏనుగు వెంటాడింది. భయాంధోళనకు గురైన ఈ ఏడుగురు తలో వైపునకు పరుగులు తీశారు. భువనేశ్వరి ఆ ప్రాంతంలో ఉన్న పొదల చాటుకు వెళ్లి దాక్కొంది. ఆమెను గమనించిన ఏనుగు అక్కడకు చేరుకొని తొండంతో భువనేశ్వరిని పట్టుకొని విసిరేసింది. ఈ ఘటనలో భువనేశ్వరి అక్కడికక్కడే మృతిచెందింది. సమాచారం అందుకున్న పెరియనాయకన్‌పాళయం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని భువనేశ్వరి మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. భువనేశ్వరికి 11 ఏళ్ల కుమారుడు, 8 ఏళ్ల కుమార్తె ఉన్నారు.

ట్రెక్కింగ్‌కు వెళ్లే వారు అటవీ శాఖ అనుమతులు తీసుకోవాలని, కానీ చాలా మంది అనుమతులు లేకుండానే వెళుతున్నారన్నారని చెప్పారు పెరియ నాయకన్‌పాళం ఫారెస్ట్‌ రేంజర్‌. అలాంటి సమయాల్లో జంతువుల దాడిలో వారు చనిపోతున్నారని చెప్పారు. ట్రెక్కింగ్‌కు వెళ్లే వారు అటవీ శాఖ అనుమతులు తీసుకోవాలని సూచించారు.

Latest Updates