ప్రింటు తీసెయ్‌‌‌‌.. కారు కొనెయ్‌‌‌‌

woman-tries-to-buy-audi-with-money-she-printed-at-home

20 ఏళ్ల అమ్మాయి. ఆడి ఏ3 కారు నచ్చింది. కొనాలనుకుంది. మరి పైసలు? అందుకే ఓ ఐడియా వేసింది. ఇంట్లో ప్రింటర్‌‌‌‌ దగ్గరకెళ్లింది. టకా టకా ఓ 15 వేల యూరోలు (రూ.11 లక్షలు) ప్రింట్‌‌‌‌ తీసింది. బ్యాగులో వేసుకుంది. ఆడి షోరూమ్‌‌‌‌కు వెళ్లింది. కారు కొంటానని చెప్పింది. ఫేక్‌‌‌‌ కరెన్సీని తీసింది. డీలర్‌‌‌‌కు ఇచ్చింది. ఆయన ఆశ్చర్యపోయాడు. ‘ఏంటి ఈ అమ్మాయి ఫేక్‌‌‌‌ కరెన్సీ ఇస్తోంది’ అనుకున్నాడు. పోలీసులకు ఫోన్‌‌‌‌ చేశాడు. వాళ్లొచ్చారు. ఆమెను అరెస్టు చేశారు. తన అపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌కు వెళ్లి వెతికారు.

ఓ కమర్షియల్‌‌‌‌ ఇంక్‌‌‌‌ జెట్‌‌‌‌ ప్రింటర్‌‌‌‌తో నోట్లు ప్రింట్‌‌‌‌ తీసిందని తెలుసుకున్నారు. ఈ తతంగమంతా జర్మనీలో జరిగింది. ఆ దేశ చట్టాల ప్రకారం సొంతంగా ఒక్కరే నకిలీ నోట్లను ముద్రిస్తే మూడు నెలలు జైలు శిక్ష. కమర్షియల్‌‌‌‌గా, గ్యాంగ్‌‌‌‌గా ఏర్పడి చేస్తే రెండేళ్ల వరకు శిక్ష ఉంటుంది.

Latest Updates