అప్పు కట్టలేదని… వివాహితను చెట్టుకు కట్టేసి కొట్టారు

ఆదోని : కర్నూలు జిల్లా ఆదోని రాజీవ్‌ గాంధీనగర్‌లో దారుణం జరిగింది. అప్పు కట్టలేదన్న కారణంతో… ఓ వివాహిత జమ్మక్క( ఎల్లమ్మ )ను ఆమె భర్త జమ్మన్న చెట్టుకు కట్టేసి హింసించాడు. అప్పులు ఇచ్చినవాళ్లు కూడా ఇందుకు సహకరించారు.  ఈ విషయం తెలిసి మీడియా అక్కడకు చేరుకుని.. ఆమెను విడిపించారు.

జమ్మన్న, జమ్మక్క దంపతులకు నలుగురు కొడుకులు, ముగ్గురు కూతుళ్లున్నారు.  కొద్దిరోజుల కింద…  భార్య జమ్మక్క కొందరి నుంచి.. దాదాపు రూ.2.50 లక్షల వరకు అప్పులు తీసుకుందని కుటుంబసభ్యులు చెప్పారు. ఇంట్లో ఉన్న రెండున్నర తులాల బంగారు నగలు… అరకిలో వెండి ఇంట్లోనుంచి ఎవరికీ చెప్పకుండా ఎత్తుకుపోయిందని ఆమె భర్త జమ్మన్న, స్థానికులు వివరించారు. తెచ్చిన అప్పులు కట్టకుండా… రెండు వారాల కిందే  ఇంటి నుంచి వెళ్లిపోయిందని అన్నారు. నిన్న సాయంత్రం తమ కాలనీలో కనిపించడంతో.. చెట్టుకు కట్టేసి కొట్టి… డబ్బుల గురించి ఆరా తీశామని భర్త, అప్పులవాళ్లు చెప్పారు. బాకీ తెచ్చిన డబ్బులను మరో వ్యక్తికి ఇచ్చాననీ.. అతడు తిరిగి ఇవ్వకుండా పారిపోయాడని ఆమె వివరించింది.

Latest Updates