కానిస్టేబుల్ పై దాడి చేసిన మహిళ

పోలీసుల విధులను అడ్డుకోవడమే కాకుండా వారిపై దాడి చేసిన మహిళను అరెస్ట్ చేశారు. ఎస్ఐ వెంకటరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఉప్పర్​పల్లిలో ఉండే యూనిస్​లాల్నున్మావి​చౌగ్నత్తు(35) అనే మహిళ సోమవారం మల్లాపూర్​వద్ద అయాన్​డిజిటల్​జోన్​లో జరుగుతున్న పరీక్ష కేంద్రానికి ఆలస్యంగా వచ్చింది. తనను లోపలికి పంపాలని సెక్యూరిటీ సిబ్బందితో వాగ్వాదానికి దిగింది. డ్యూటీలో ఉన్న నాచారం పోలిస్టేష్​ కానిస్టేబుల్ జి.రమేష్​అది గమనించి ఆమెకు సర్దిచెప్పే ప్రయత్నం చేశాడు. నేను ఎవరనుకుంటున్నావు మేఘాలయలో డీజీగా పనిచేసి రిటైర్ట్​అయిన దొతాంగ కూతురునని కానిస్టేబుల్​పై దాడిచేసి అతని చేతిలో ఉన్న టాబ్​ని కింద పడేసింది. కానిస్టేబుల్​ రమేష్​ అధికారులకు సమాచారం ఇచ్చి మహిళపై  కంప్లయింట్ చేశాడు. ఆమెను అదుపులోకి తీసుకొని విచారించగా గతంలో ఆమెపై నగరంలోని పలు పోలీస్టేషన్లలో సుమారు 25 కేసుల వరకు ఉన్నాయని తెలుసుకున్నారు. అరెస్ట్​ చేసి రిమాండ్​కు తరలించామని నాచారం ఎస్ఐ తెలిపారు.

Latest Updates