పురుషుడిగా మారి స్నేహితురాలిని పెళ్లాడిన అమ్మాయి

చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్నారు. ఇటీవలే ఇంజినీరింగ్ కూడా పూర్తి చేశారు. ఒకరంటే మరొకరికి ఎంతో ఇష్టం. ఆ ఇష్టం కాస్త ప్రేమగా మారింది. ఒకరిని విడిచి మరొకరు ఉండలేని స్థితికి వచ్చారు. దీంతో ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు.ఆ ఇద్దరూ ఇంట్లో వాళ్లను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న ఆ ఇద్దరూ అమ్మాయిలే. ఈ ఘటన ఒడిశాలో జరిగింది.

మల్కనగిరికి చెందిన ఇద్దరు అమ్మాయిలు క్లాస్ మెట్స్. ఇంజనీరింగ్ పూర్తి చేయడంతో…వారి ఇంట్లో వాళ్లు వాళ్లకు పెళ్లి చేయాలని నిర్ణయించారు. అయితే ఆ ఇద్దరు అమ్మాయిలు అప్పటికే ప్రేమలో మునిగిపోయారు. పెళ్లి చేసుకుని కలిసి జీవించాలని నిర్ణయించుకున్నారు.ఆ ఇద్దరు అమ్మాయిల్లో..ఒకరు పురుషుడిగా మారాలని నిర్ణయింకుంది. ఇదే విషయాన్ని వారి కుటుంబ సభ్యులకు చెప్పి ఒప్పించారు. ఇద్దరి తల్లిదండ్రుల అనుమతితో లింగమార్పిడి చేయించుకుని పురుషుడిగా మారింది. ప్రేమికుల దినోత్సవం (ఫిబ్రవరి-14) రోజున మ్యారేజ్ చేసుకోవాలని అనుకున్నారు. అయితే.. ఈ నెల 10న ముహూర్తం కుదరడంతో బంధుమిత్రులు, స్నేహితులు సమక్షంలో వీరు వివాహం చేసుకున్నారు. వివాహ బంధంతో ఒక్కటైన స్నేహితులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Latest Updates