లాక్ డౌన్ ఎఫెక్ట్ : సొంతూరు పోలేక బిచ్చం అడుక్కుంది

  • ఖమ్మం ఫంక్షన్ కు వెళ్లింది
  •  లాక్డౌన్ నేపథ్యంలో మానుకోటలో చిక్కుకుంది.
  •  17 రోజులుగా పిల్లలతో కలిసి భిక్షాటన
  •  ఆటో కిరాయికి మాట్లాడి చుట్టాల ఇంటికి పంపించిన పోలీసులు

శుభకార్యానికి హాజరు కావడానికి వచ్చిన ఓ తల్లితో పాటు ఇద్దరు చిన్న పిల్లలు లాక్ డౌన్ నేపథ్యంలో మానుకోటలో చిక్కుకున్నారు.. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు వారిని ఆటో మాట్లాడి సొంతూరికి పంపించారు. వివరాలిలా ఉన్నాయి.. పెద్ద పల్లి జిల్లా రామగుండం ప్రాంతానికి చెందిన ఓ మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం సుబ్లేడ్ గ్రామంలో ఓ శుభకార్యానికి హాజరైంది. గత నెల 23న తిరుగు ప్రయాణంలో బాగంగా ఆటోలో మహబూబాబాద్ కు వచ్చింది. ఇక్కడి నుంచి రైలులో పెద్దపల్లికి వెళ్దామనుకుంది. అప్పుడే లాక్ డౌన్ స్టార్ట్ కావడంతో ప్రజా రవాణా వ్యవస్థ పూర్తిగా నిలిచిపోయింది. దీంతో ఆమెకు ఇక్కడ తెలిసిన వారు లేక, కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడానికి సెల్‌‌‌‌‌‌‌‌ఫోన్‌ ‌‌‌లేక రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లోనే భిక్షాటన చేసింది. దాతలు ఇచ్చేది తాను, పిల్లలు తింటూ 17 రోజులుగా జీవనం సాగించారు. విషయం తెలుసుకున్న టౌన్ సీఐ రవికుమార్, ట్రాఫిక్ ఎస్సై రవీందర్ ఆటో కిరాయికి మాట్లాడి ఖమ్మం జిల్లా సుబ్లేడ్ గ్రామంలోని బంధువుల ఇంటికి తిరిగి పంపించారు. పోలీసుల సేవాభావాన్ని స్థానికులు అభినందించారు.

Latest Updates