సిద్ధిపేట్: బెల్ట్ షాపులపై మహిళా సంఘాల దాడి

సిద్ధిపేట్ జిల్లాలో బెల్ట్ షాపులపై మహిళా సంఘాలు దాడి చేశాయి. దుబ్బాక మండలం రాజక్కపేటలో ఉన్న బెల్ట్ షాపులపై మహిళలు దాడి చేసి మద్యాన్ని రోడ్డుపై పడేశారు. గ్రామంలో మద్యం అమ్మొద్దు అంటూ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఊర్లలో మద్యం.. ఏరులై పారుతున్నాయన్నారు. మద్యం మత్తులో ఇళ్ళకు వచ్చిన భర్తలు భార్యలతో గొడవలకు దిగుతున్నారన్నారు. మద్యాన్ని నిషేధించాలని డిమాండ్ చేశారు. మహిళలలో పాటు కొంత గ్రామస్తులు కూడా నిరసనలో పాల్గొన్నారు.

Latest Updates