మహిళలు ప్రతి అంశాన్ని చాలెంజ్​​గా తీస్కోండి

మహిళలకు గవర్నర్ తమిళిసై సూచన
రాజ్ భవన్ లో ఉమెన్స్​డే వేడుకలు

హైదరాబాద్, వెలుగు: మహిళలు ధైర్యంగా ఉండాలని, ప్రతి అంశాన్ని చాలెంజ్​గా తీసుకోవాలని గవర్నర్ తమిళిసై సూచించారు. పురుషులతో సమానంగా ముందుకు సాగాలని అన్నారు. బుధవారం రాజ్ భవన్ లో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవాల్లో గవర్నర్ పాల్గొన్నారు. ఆరోగ్యం విషయంలో మహిళలు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన 21 మందికి అవార్డులు అందజేశారు.

వీరిలో ప్రముఖ బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు, యూట్యూబ్ స్టార్ గంగవ్వ కూడా ఉన్నారు. కార్యక్రమంలో విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, వైఎస్సార్​సీపీ ఎమ్మెల్యే రోజా, మాజీ ఎంపీ గుండు సుధారాణి, మహబూబాబాద్ జడ్పీ చైర్ పర్సన్ బింధుతోపాటు పలువురు పాల్గొన్నారు.

see also: వైరస్ సోకిన ఆ ఇద్దరిని కలిసిందెవరు?

షేక్ హ్యాండ్ వద్దు .. నమస్తే ముద్దు

 

 

Latest Updates