అమ్మాయిల క్రికెట్ పట్టదా.. ?

నెలలుగా ఇళ్లలోనే క్రికెటర్లు

ఇంగ్లండ్ టూర్ రద్దు.. టీ20 చాలెంజ్ డౌటే

నేషనల్‌ క్యాంప్‌ ఊసెత్తని బోర్డు.. ఐపీఎల్ పైనే బీసీసీఐ ఫోకస్‌

మిథాలీ రాజ్‌, జులన్గోస్వామి వంటి వన్డే ప్లేయర్లు నవంబర్ నుంచి మ్యాచ్ఆడలేదు..! మార్చి 8 తర్వాత మిగతా అమ్మాయిలూ గ్రౌండ్లోకి రాలేదు. ఇంగ్లండ్టూర్ రద్దయిం ది. మహిళల టీ20 చాలెంజ్జరగడం అనుమానమే. కొత్త సెలక్షన్ప్యానెల్ప్రక్రియ పెండింగ్లో ఉంది. వన్డే వరల్డ్కప్సమీపిస్తోం ది. కానీ బీసీసీఐ దృష్టంతా ఐపీఎల్ పైనే ఉంది. ఐదు నెలలుగా ఇళ్లకే పరిమితమైన అమ్మాయిల టీమ్ ఇయర్ ఒక్క మ్యాచ్అయినా ఆడుతుందా?

(వెలుగు స్పోర్ట్స్ డెస్క్‌‌)

ఆస్ట్రేలియా వేదికగా జరిగిన మహిళల టీ20 వరల్డ్‌ కప్‌ తర్వాత అమ్మాయిల క్రికెట్‌కు క్రేజ్ పెరిగింది. దాంతో ఈ ఇయర్​ ఇండియా వరుస టోర్నీలతో బిజీగా ఉండాల్సింది. ఐపీఎల్‌ టైమ్‌ లో నాలుగు జట్లతో కూడిన మహిళల టీ20 ఛాలెంజ్‌ .. అది ముగిసిన వెంటనే ఇంగ్లండ్‌ టూర్​.. తర్వాత నెక్స్ట్ ఇయర్ జరిగే వన్డే వరల్డ్‌ కప్‌ కోసం ప్రిపరేషన్స్‌ మొదలుపెట్టాలి. కానీ, కరోనా కారణంగా ఆ ప్లాన్ స్‌ అన్నీ దెబ్బతిన్నాయి. ప్రస్తుత పరిస్థితిని చూస్తుంటే అమ్మాయిలు ఈ ఏడాదిలో మళ్లీ కాంపిటీటివ్ క్రికెట్‌ ఆడేలా లేరు. ఫోకస్​ అంతా ఐపీఎల్​పైనే పెట్టిన బీసీసీఐ.. అమ్మాయిల ఆటను పక్కనపెట్టేసింది. షెడ్యూల్‌  ప్రకారం ఈ ఏడాది జులై-ఆగస్టులో ఇండియా టీమ్‌ .. బైలేటరల్‌ సిరీ స్‌ (వన్డే) కోసం ఇంగ్లం డ్‌ వెళ్లాలి. కానీ, కరోనా కారణంగా అది రద్దయింది. అయితే, దీని ప్లేస్‌ లో సెప్టెంబర్​లో సౌతాఫ్రికాతో కలిసి ఇంగ్లండ్‌ బోర్డు ఓ ట్రై సిరీస్‌ ప్లాన్‌ చేసింది. ఈ ప్రపోజల్​ను కూడా బీసీసీఐ రిజక్ట్‌‌ చేసింది దీంతో అమ్మాయిలకు నిరీక్షణ తప్పడంలేదు.

సెలక్షన్‌‌ ప్యానెల్‌‌ లేదు

మహిళా క్రికెట్‌ కు జనవరి నుంచి సెలెక్షన్ ప్యానె ల్‌ లేదంటే ఆశ్చర్యం కలగక మానదు.హేమలత కాలా నేతృత్వంలోని ప్యానె ల్‌ కు లాస్ట్‌‌ ఇయర్​అక్టోబర్​లో ఇచ్చిన ఎక్స్‌ టెన్షన్‌ జనవరి 22తో ముగిసింది. ఆ తర్వాత కొత్త ప్యానెల్‌ కోసం ఇండియా మాజీ క్రికెటర్ల నుంచి గత డిసెంబర్​లోనే దరఖాస్తులు ఆహ్వానించిన బోర్డు.. జనవరి 24వ తేదీని డెడ్‌ లైన్‌ గా విధించింది. దరఖాస్తులు స్వీకరించి నెలలు గడిచినా బోర్డు.. ఇప్పుడు ఆ ఊసేత్తడం లేదు.ఈ విషయంపై స్పందించిన బీసీసీఐ బాస్‌ గంగూలీ ఇప్పుడున్న సిచ్యువేషన్‌ లో ఇంటర్వ్యూల నిర్వహణ సాధ్యం కాదన్నాడు. అక్టోబర్ వరకూ మహిళలకు ఎలాంటి ఈవెంట్లు లేవని, ఆ లోపు కమిటీ ఏర్పాటు చేస్తామన్నాడు. అయితే, మెన్స్​ టీమ్‌ కోచ్‌ల కోసం బోర్డు ఆన్‌ లైన్‌ ఇంటర్వ్యూలు నిర్వహించిం ది. ప్రస్తుతం బోర్డు కార్యకలాపాలు కూడా వర్చువల్​గానే జరుగుతున్నాయి. అలాంటప్పుడు అమ్మాయిల సెలెక్షన్‌ ప్యానె ల్‌ కోసం ఆన్‌ లైన్ ఇంటర్వ్యూ లు ఎందుకు నిర్వహించరనే ప్రశ్న ఎదురవుతోంది. సెలెక్షన్‌ ప్యానె ల్‌ మాత్రమే కాదు.. రత్నాకర్​శెట్టి రిటైర్మెంట్‌ తర్వాత వుమెన్స్‌ క్రికెట్‌ బాగోగులు చూసేవారే కరువయ్యా రు. ఇటీవల సబా కరీమ్​ కూడా తన పదవికి రిజైన్​ చేయడంతో అమ్మాయిలను పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడు.

కోచింగ్క్యాంప్‌‌  మొదలయ్యేనా ?

యూఏఈలో జరిగే ఐపీఎల్‌ కోసం దుబాయ్‌ లో నెక్స్‌ట్ మంత్‌ ట్రెయినింగ్​ క్యాంప్‌ స్టార్ట్‌‌ కానుంది. అదే టైమ్‌ లో లీగ్‌ లో ఆడని సెంట్రల్​ కాంట్రాక్టు ప్లేయర్ల కోసం అహ్మదాబాద్‌ మొతెరా స్టేడియంలో స్పెషల్‌ క్యాంప్‌ జరగనుంది. కానీ, మార్చి 8 నుంచి ఆటకు దూరమైన అమ్మాయిలు మళ్లీ గ్రౌండ్‌ లోకి ఎప్పుడు వస్తారో తెలియడం లేదు. మిథాలీ, జులన్‌ లాంటి ప్లేయర్లు నవంబర్​ నుంచి కాంపిటీటివ్‌‌ క్రికెట్‌ కు దూరంగా ఉన్నారు. వచ్చే ఏడాది వన్డే వరల్డ్‌ కప్‌ ఉన్నా ప్రిపరేషన్స్‌ కోసం బోర్డు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కనీసం కోచింగ్‌ క్యాంప్‌ అయినా నిర్వహిస్తుందో లేదో కూడా తెలియడం లేదు. మహిళా క్రికెటర్లు నెలల తరబడి గ్రౌండ్ కు దూరంగా ఉంటే వాళ్ ఫిట్‌ నెస్‌ , గేమ్‌ దెబ్బతింటుం ది. మరి, బోర్డు ఇప్పటికైనా మేల్కొంటుందా?

 టీ20 చాలెంజ్‌‌ కష్టమే?

ఐపీఎల్‌ టైమ్‌ లో జరిగే టీ20 చాలెంజ్‌ టోర్నీపై మహిళా క్రికెటర్లు కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. నాలుగు జట్లతో వుమెన్స్‌ టీ20 చాలెంజ్‌ (మహిళల ఐపీఎల్) టోర్నీ నిర్వహించాలని బీసీసీఐ ముందుగా ప్లాన్‌ చేసింది. షెడ్యూల్‌ ప్రకారం ఐపీఎల్‌ జరిగితే.. ఈ టీ20 చాలెంజ్‌ కూడా జరిగేది. డొమెస్టిక్‌‌ వుమెన్‌ క్రికెటర్లకు ఓ వేదిక దొరికేది. కానీ, కరోనా కారణంగా ఐపీఎల్‌ నిరవధికంగా వాయిదా పడింది. ఈ ఇయర్​ టీ20 వరల్డ్‌ కప్‌ లేకపోవడంతో ఆ విండోలో యూఏఈ వేదికగా లీగ్‌ నిర్వహణకు బీసీసీఐ రెడీ అయ్యింది. దీంతో ఫ్రాంచైజీలన్నీ త్వరలో అక్కడికి వెళ్లేం దుకు రెడీ అవుతున్నాయి. ఇంతవరకు బాగానే ఉన్నా.. వుమెన్స్‌ టీ20 చాలెంజ్‌ పరిస్థితి ఏంటి ? అంటే సమాధానం దొరకడం లేదు. దీనిపై బీసీసీఐ అధికారులు కానీ, ఫ్రాంచైజీలు గానీ నోరువిప్పడం లేదు. కానీ ఆదివారం జరిగే ఐపీఎల్‌ గవర్నిం గ్‌ కౌన్సిల్‌ మీటింగ్‌ లో క్లారిటీ వస్తుందని పలువురు ఆశిస్తున్నారు. అయితే, టీ20 చాలెంజ్‌ నిర్వహిద్దా మనుకున్నా.. వుమెన్స్‌ బిగ్‌ బాష్‌ లీగ్‌ (డబ్ల్యూ బీబీఎల్‌ ) తో క్లాష్​ వచ్చే ప్రమాదం ఉంది. ఈ టోర్నీ అక్టోబర్​17 నుంచి నవంబర్​ 29 వరకు ప్లాన్‌ చేశారు. దాంతో ఫారిన్‌ క్రికెటర్లు వచ్చే చాన్స్‌ లేదు. కాబట్టి, ఈ సారి టీ20 చాలెంజ్‌ రద్దుకే మొగ్గు ఎక్కువ. అదే టైమ్‌ లో డబ్ల్యూ బీబీఎల్‌ లో కాంట్రాక్టు దక్కించుకున్న ఇండియా క్రికెటర్లకు ఎన్‌ ఓసీ ఇస్తే కనీసం వాళ్లయినా అందులో ఆడుకుంటారు. ఎలాగూ వచ్చే జనవరిలో ఆస్ట్రేలియాలో జరిగే బైలేటరల్‌ సిరీ స్‌ వరకూ ఎలాంటి టోర్నీలు లేవు. కాబట్టి ఈ లీగ్‌ తో అయినా కొందరు అమ్మాయిలకు గ్రౌండ్‌ లోకి వచ్చే అవకాశం లభిస్తుంది.

 

Latest Updates