నాలాలో కొట్టుకొచ్చిన మహిళ కాలు.. స్థానికుల్లో భయాందోళ‌న‌లు

హైదరాబాద్‌లో భారీ వర్షాలు పడుతున్న వేళ వరద నీటికి నాలాలో ఓ మహిళ కాలు కొట్టుకురావడం కలకలం రేపుతోంది. చంపాపేట్ రెడ్డి బస్తీలోని నాలాలో కొట్టుకొచ్చిన కాలు ను చూసి… స్థానికులు ఒక్కసారిగా షాక్ తిన్నారు. తొలుత భయభ్రాంతులకు గురైన వారు.. చుట్టుపక్కల డెడ్ బాడీ కనిపిస్తుందేమో అని నాలాలో వెతికారు. డెడ్ బాడీ కనిపించక పోవడంతో డయల్ 100 ఫోన్ చేసి పోలీసుల‌కు సమాచారం అందించారు . సంఘటన స్థలానికి సైదాబాద్ పోలీసులు, క్లూస్ టీమ్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని , కాలును స్వాధీనం చేసుకున్నారు. దాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు

Latest Updates