పెళ్లిలో విషాదం..లిఫ్ట్‌లో ఇరుక్కొని మహిళ మృతి

హైదరాబాద్‌: రాజేంద్రనగర్‌లో వివాహ వేడుకలో విషాదం చోటు చేసుకుంది. వివాహ వేడుకకు వెళ్లిన మహిళ కన్వెన్షన్ హాల్‌లోని లిఫ్ట్‌లో ఇరుక్కొని మహిళ మృతి చెందడంతో కలకలం రేగింది. బండ్లగూడ కేకే కన్వెన్షన్‌ హాల్‌లో వివాహానికి హాజరైన మహిళ అక్కడి లిఫ్ట్‌లో ఇరుక్కొని మృతి చెందింది. దీంతో బంధువులు ఆందోళన చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునే సరికే కన్వెన్షనల్ హాల్ యజమాని పరారయ్యాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

Latest Updates