పైసలిచ్చినా..పట్టా చేయలే : VRO కాలర్ పట్టుకుని నిలదీసిన వృద్ధురాలు

సంగారెడ్డి: సంవత్సరాలు గడుస్తున్నా..ఓ ముసలవ్వ భూమి సమస్య పరిష్కారం కాలేదు. VROకి లంచం కూడా ఇచ్చింది. అయినా సరే పట్టాచేయలేదు. తహసీల్దార్ ఆఫీసు చుట్టు కాళ్లరిగేలా తిరిగింది. ఓపిక నశించిన పోచమ్మ అనే వృద్ధురాలు.. VROను కాలర్ పట్టుకుని నిలదీసింది.పబ్లిక్ లో కాలర్ పట్టుకుంటావా అంటూ ఆమెను VRO తోసేయడంతో స్పృహ కోల్పోయింది. స్థానికులు వెంటనే పోచమ్మను హస్పిటల్ కి తరలించారు.

అయితే వృద్ధురాలు కాలర్ పట్టుకున్నందుకే తోసేశానని తెలిపాడు వీఆర్వో. ఈ సంఘటన శుక్రవారం సంగారెడ్డి జిల్లా వట్‌ పల్లి తహసీల్దార్‌ ఆఫీసులో జరిగింది. ఈ విషయంపై రెవిన్యూ అధికారులెవరూ స్పందించలేదని తెలిపారు స్థానికులు. VRO కాలర్ పట్టుకున్న ఫొటోలు బయటికి రావడంతో అధికారుల నిర్లక్ష్యంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పుకుంటున్నారు.

Latest Updates