రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదు

హైదరాబాద్: బంగారు తెలంగాణలో మహిళలకు భద్రతలేదన్నారు ములుగు ఎమ్మెల్యే సీతక్క. బతుకమ్మ పండుగ రోజైన మహిళలకు భద్రత కలిపించేలా ఒక చట్టం తీసుకురావాలన్నారు సీతక్క. శుక్రవారం ఎంగిలిపూల బతుకమ్మ సందర్భంగా తెలుగు తల్లి విగ్రహం దగ్గర కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి ధర్నా చేశారు. బతుకమ్మ సంబరాలు వద్దు.. రక్షణ కావాలి అంటూ మహిళలు నినాదాలు ఇవ్వాలని పిలునిచ్చారు సీతక్క. మహిళల మీద ఇన్ని ఘటనలు జరుగుతున్న సీఎం కేసీఆర్, మంత్రులు ఎందుకు ఒక్క అయినా మాట్లాడటం లేదని ప్రశ్నించారు.

 ఖమ్మంలో అత్యాచారానికి గురై మరణించిన దళిత బాలికను ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. 25 రోజులు మృత్యువుతో పోరాడి మరణించిందన్నారు. బాలిక కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. నిందితులకు ఉరిశిక్ష విధించాలని కోరారు. మహిళలకు జరుగుతున్న అన్యాయాలను చెప్పుకుందామంటే మహిళా కమిషన్ లేదన్నారు ఎమ్మెల్యే సీతక్క.

Latest Updates