చుట్టాల ఇంటికెళ్లిన యువతి అదృశ్యం

మేడ్చల్ : బంధువుల ఇంటికి వెళ్తున్నానని వెళ్లిన యువతి కనిపించకుండా పోయిన ఘటన మేడ్చల్ జిల్లాలో జరిగింది.  ఘట్కేసర్ మండలం ప్రతాప్ సింగారం గ్రామానికి చెందిన మారియా (21) అనే యువతి ఏప్రిల్ 29న చుట్టాల ఇంటికి వెళ్తున్నానని ఇంట్లో తల్లికి చెప్పి వెళ్లింది. అయితే చుట్టాల ఇంటికి వెళ్లకుండా ఎటుపోయిందో తెలియదని..  మారియా, తిరిగి రాకపోవడంతో స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు యువతి తల్లిదండ్రులు.

మిస్సింగ్ కేస్ నమోదు చేసిన ఘట్ కేసర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అయితే వరుసగా అమ్మాయిల హత్యలతో తమ కూతురు ఎక్కడుందోనని కన్నీరుమున్నీరవుతున్నారు యువతి తల్లిదండ్రులు. యువతి చదువు వివరాలు తెలియాల్సి ఉంది.

 

Latest Updates