ప్రియుడితో కలిసి కొడుకును చంపిన తల్లి

కొయంబత్తూరు : ప్రియుడితో రొమాన్స్ చేస్తుండగా అడ్డొ్చ్చాడని కన్న కొడుకునే చంపేసింది ఓ తల్లి. ప్రియుడితో కలిసి 6 ఏళ్ల కుమారున్ని చిత్ర హింసలకు గురిచేసి హత్య చేసింది. ఈ విషాదకరమైన సంఘటన తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లా తడియాలురులో జరిగింది. కోవిల్‌ మేడు కు చెందిన దివ్య (30) కు కొన్నాళ్ల క్రితం ఓ వ్యక్తితో వివాహమైంది. వారికి ఇద్దరు పిల్లలున్నారు. మనస్పర్థల కారణంగా వారిద్దరూ కొద్దిరోజుల క్రితం విడిపోయారు. దీంతో దివ్య ఇద్దరు పిల్లలతో కలిసి తుడియలూరుకు జీవనం సాగిస్తోంది. ఇదే ప్రాంతానికి చెందిన రాజదురైతో ఆమె అక్రమ సంబంధం పెట్టుకుంది. ఇటీవలే సాయిబాబా కాలనీకి మారారు. వీరిద్దరూ కలిసే సమయంలో పిల్లలను బయటకు పంపిస్తుంటారు. మంగళవారం 6 ఏళ్ల కుమారుడు అభిషేక్ బయటకి వెళ్లకపోవటంతో ప్రియుడితో కలిసి టార్చర్ చేసింది దివ్య. తీవ్రంగా గాయాలు కావటంతో వెంటనే 108 కు ఫోన్ చేసి హాస్పిటల్ తీసుకెళ్లారు. అప్పటికే అభిషేక్ చనిపోయాడు. కుమారుడికి ఏమైందని 108 సిబ్బంది ప్రశ్నించగా పొంతన లేని సమాధానాలు చెప్పటంతో అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల విచారణలో అభిషేక్ తామే హత్య చేసినట్లు దివ్య ఆమె ప్రియుడు అంగీకరించారు. వీరిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు.

Latest Updates