కొణిజ‌ర్ల‌లో విషాదం.. బావిలో ప‌డి మ‌హిళా కూలీలు మృతి

ఖమ్మం జిల్లా కొణిజర్లలో విషాదం చోటు చేసుకుంది. పొలం పనులు కోసం వెళ్లిన మ‌హిళా కూలీలు ప్ర‌మాద‌వ‌శాత్తూ బావిలో ప‌డి మ‌ర‌ణించారు. మధ్యాహ్నం సమయంలో భోజనం చేసి నీళ్ల కోసం పక్కనే ఉన్న దిగుడు బావి దగ్గరకు వెళ్లారు. నీళ్ల కోసం బావిలోకి దిగిన ఓ మ‌హిళ‌.. కాలు జారీ బావిలో పడగానే ఆమెను కాపాడబోయి మ‌రో న‌లుగురు కూడా బావిలో ప‌డిపోయారు. పక్కనే ఉన్న రైతులు అది గ‌మ‌నించి బావిలోకి దూకి ముగ్గురిని కాపాడారు. మ‌రో ఇద్దరు మ‌హిళ‌లు మృతి చెందారు. ఈ ఘటనతో కొణిజర్లలో విషాధచాయలు అలుముకున్నాయి.

Women laborers died fell down in well accidentally after going for drinking water

Latest Updates