అందంతో పడేస్తుంది : పెళ్లి పేరుతో దోచేస్తుంది

women-marriage-game-arrest-madhyapradesh-police

మధ్యప్రదేశ్: పెళ్లి పేరుతో అమ్మాయిలను మోసం చేసే మగవారిని చూశాం కానీ..ఓ కిలాడీలేడీ మగవారినే మోసం చేస్తుంది. చూడటానికి అందంగా ఉంటుంది. ఎవ్వరైనా పడిపోవాల్సిందే. అలాంటి అందాన్నే డబ్బు సంపాదించడానికి అడ్డంగా పెట్టుకుంది. ఓ నలుగురి వ్యక్తుల ముఠాతో చేతులు కలిపింది. బాగా రిచ్ గా ఉన్న వ్యక్తులనే టార్గెట్ చేస్తూ..వారితో పరిచయం పెంచుకుంటుంది. లవ్ లో పడేస్తుంది. పెళ్లికి ఒప్పిస్తుంది. తనది పేదరికం అమ్మానాన్న లేరు, అన్నయ్య మాత్రమే ఉన్నాడని చెబుతుంది. ఆ యువతి అందాన్ని చూసి, పెళ్లి చేసుకుంటారు. ఆ తర్వాత తీరా ఫస్ట్ నైట్ కాకముందే..ఆ ఇంట్లో నుంచి డబ్బులు, గోల్డ్, సిల్వర్, కాస్టీ వస్తువులతో జంప్ అవుతారు అన్నాచెళ్లి. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లోని బుందేల్‌ఖండ్‌లో జరిగింది.

women-marriage-game-arrest-madhyapradesh-police

ఇలా ఒకటి కాదు..రెండు కాదు మూడు చోట్ల భారీగా దోచేశారు. ముగ్గురిని పెళ్లి చేసుకుంది ఒక్కరితో కూడా శోభనం చేసుకులేదు ఓ ఈ కిలాడీలేడీ. తీరా ఆ శుభకార్యానికి ముందే తాము అనుకున్న దొంగతనం చేసేస్తారు. చివరకు నాలుగో మొగుడు ఈ వయ్యారి భామ ఆటలను కట్టేశాడు. ఛత్తార్‌ పూర్ అనే గ్రామానికి చెందిన సునీల్ గుప్తా అనే వ్యక్తికి ఈ యువతి పరిచయం అయింది. ఆమెను గుప్తా పెళ్లిచేసుకోవాలనుకున్నాడు. , తనకు తల్లిదండ్రులు లేరని, ఓ అన్న ఉన్నాడని ఆ యువతి చెప్పింది. ఈ క్రమంలో తమ బంధువుల పేరుతో ఓ ఇద్దరిని పరిచయం చేసింది. ఆ తర్వాత రాహుల్ అనే మరో వ్యక్తిని పరిచయం చేసింది. అతడే తన అన్న అని తెలిపింది.

తాను నీ సిస్టర్ ను పెళ్లిచేసుకోవాలనుకుంటున్నానని సునీల్ గుప్తా.. రాహుల్‌ తో మాట్లాడాడు. పెళ్లికి అంగీకరించినట్టు రాహుల్ డ్రామా ఆడారు. అయితే, తన దగ్గర డబ్బు లేదని, పెళ్లికూతురు తరఫున నిర్వహించాల్సిన క్రతువు కోసం అవసరమైన డబ్బు కూడా గుప్తానే ఇవ్వాలని కండిషన్ పెట్టాడు. స్వప్న మీద మనసు పారేసుకున్న గుప్తా.. మొదట రూ.లక్షకు డీల్ కుదుర్చుకున్నాడు. తర్వాత రూ.95 వేలు ఇచ్చాడు. మార్చి 4న సునీల్ గుప్తా, స్వప్న పెళ్లి జరిగింది. రాహుల్ దగ్గరుండి కన్యాదానం చేశాడు. అంతా కలసి సునీల్ గుప్తా ఇంటికి వెళ్లారు. మార్చి 4, మార్చి 5 రాత్రి అక్కడే ఉన్నారు. మార్చి -7న శోభనం ఉందని వరుడి తల్లి యువతికి చెప్పింది. ఇక అంతే.. మార్చి 6వ తేదీ తెల్లవారి లేచి చూసేసరికి అన్నాచెల్లెళ్లు ఇద్దరూ జంప్ అయ్యారు. అయితే.. నగలతో పారిపోతున్న వెహికిల్ నంబర్ ను నోట్ చేసుకున్నడు గుప్తా. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ముఠాను అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ కిలాడీ లేడీ వెనకాల ముగ్గురు మహా ముదురు ఫేక్ అన్నయ్యలు ఉన్నారని గుర్తించారు పోలీసులు. విచారణ జరుపుతున్నామని పూర్తి వివరాలనే సేకరిస్తున్నామని తెలిపారు.

Latest Updates