రంగారెడ్డి జిల్లాలో నవ వధువు ఆత్మహత్య

రంగారెడ్డి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది.  నర్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పీరం చెరువు గ్రామంలో నవ వధువు ఆత్మహత్య  చేసుకుంది.  బాత్ రూమ్ లో చీరతో ఉరి వేసుకొని కృతిక అనే నవ వధువు ఆత్మహత్యకు పాల్పడింది. కృతిక కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు.  వికారాబాద్ జిల్లాకు చెందిన కృతిక ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఇంజినీర్ గా పనిచేస్తుంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నారు.

Latest Updates